BigTV English
Advertisement

Jatadhara Twitter Review: ‘జటాధర’ట్విట్టర్ రివ్యూ.. సుధీర్ బాబు హిట్ కొట్టాడా..?

Jatadhara Twitter Review: ‘జటాధర’ట్విట్టర్ రివ్యూ.. సుధీర్ బాబు హిట్ కొట్టాడా..?

Jatadhara Twitter Review: టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ చిత్రం ‘జటధార’.. షార్ట్ ఫిలిమ్స్ కి డైరెక్ట్ చేసి.. తర్వాత ‘రాక్షస కావ్యం’ అనే సినిమాకి ఎడిటర్ గా చేసిన వెంకట్ కళ్యాణ్  ఈ మూవీతో డైరెక్టర్ గా పరిచయం అయ్యారు. ప్రేరణ అరోరా,ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. లంకె బిందెలు, పిశాచ బంధనం కాన్సెప్ట్ తో ఈ మూవీని తెరకెక్కించారు.. ఇప్పటివరకు ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. భారీ అంచనాల నడుమ ఇవాళ థియేటర్లోకి పోయి వచ్చేసింది. సుధీర్ బాబుకి గత కొన్నేళ్లుగా సరైన హిట్ సినిమా పడలేదు. ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు. మరి తన ఆశలు నెరవేరయ్య లేదా అన్నది ఇప్పుడు మనం ట్విట్టర్ రివ్యూ లో చూసేద్దాం.


మైథలాజి కాన్సెప్ట్ సినిమాలకి కొన్నాళ్ల నుండి థియేటర్స్ లో కాసుల వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. ‘జటాధర’ కి కూడా ఆ అవకాశాలు ఉన్నాయి. ఈ మూవీకి ఇదే ప్లస్ పాయింట్. ఈ సినిమాకు పెద్దగా ప్రమోషన్స్ చెయ్యలేదు కానీ.. ఈ మూవీ స్టోరీ వల్ల సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి. ఇవాళ భారీ అంచనాలతో ఈ మూవీ థియేటర్లలోకి వచ్చేసింది. మరి జనాల రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం..

మంచి కథతో ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అతీంద్రియ అనుభవాన్ని అందిస్తుంది.. సోనాక్షి సిన్హా ధన పిశాచినిగా మెరిసింది. ఇప్పటి వరకు ఆమె చేసిన అత్యంత అద్భుతమైన పాత్రలలో ఇది ఒకటి.. సుధీర్‌బాబు, ఘోస్ట్ హంటర్‌గా కూడా ఆకట్టుకున్నాడు..ఈ మూవీ ఆసక్తిని పెంచుతుంది. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు.


అందరు కూడా సుధీర్ బాబు జటాధర గురించి మాట్లాడుతున్నారు. ఈ గ్రిప్పింగ్ మిస్టరీ చివరకు మిమ్మల్ని అనంత పద్మనాభ స్వామి ఆలయ రహస్యాలలోకి తీసుకెళ్తుంది.. విజువల్స్ బాగా ఆకట్టుకుంటాయి అని మరొకరు ట్వీట్ చేశారు.

సుధీర్ బాబుకు కమ్ బ్యాక్ ఇచ్చే మూవీ.. బ్లాక్ బాస్టర్ పక్కా. థియేటర్లలో మిస్ అవ్వకుండా చూసేయ్యండి అంటూ మరొకరు ట్వీట్ చేశారు..

జటాధర మూవీకి జనాల నుంచి అమేజింగ్ రెస్పాన్స్ ను అందుకుంటుంది. ఈ మూవీ అంతగా బాగోదు అని థియేటర్లకు వెళ్లే వాళ్లు సర్ప్రైజ్ అవుతారు. సుధీర్ బాబు అదరగొట్టేసాడు., సినిమాను థియేటర్లలో చూసేయ్యండి. అంటూ మరొకరు ట్వీట్ చేశారు.

ట్రైలర్లు, టీజర్లు ఈ మూవీకి మంచి రెస్పాన్స్ ను అందించాయి. సుధీర్ బాబుకి కచ్చితంగా ఈ మూవీ కమ్ఇస్తుందని చాలా మంది అనుకున్నారు.. సినిమా మొత్తం గూస్ బంప్స్ తెప్పిస్తుందని టాక్ వినిపిస్తుంది.. మొత్తానికైతే ఇప్పటివరకు పాజిటివ్ రెస్పాన్స్ వినిపిస్తుంది. మూవీ ఫైనల్ టాక్ ఎలా ఉంటుంది. కలెక్షన్స్ ఏ మాత్రం వసూల్ అవుతాయో చూడాలి..

Related News

Rahul Ravindran -Samantha: నాగచైతన్యతో సమంత విడాకులు… రాహుల్ రవీంద్రన్ ఏమన్నారంటే?

Bhagya Shri -Ram Pothineni: నేను రొమాంటిక్ కాదు బాబోయ్.. రామ్ గురించి షాకింగ్ విషయాలు చెప్పిన భాగ్యశ్రీ!

Bro 2 Movie: బ్రో 2 స్క్రిప్ట్ మొత్తం సిద్ధం… పవన్ కళ్యాణ్ అనుమతే ఆలస్యమా?

Bhagya Shree Borse:  మేడమ్ ను ఫస్ట్ పట్టింది మేమే… భాగ్య శ్రీ పై రానా కామెంట్స్!

Rana Daggubati: మద్యం మత్తులో మాట్లాడలేదురా..రానాను ఆడేసుకున్న ఫ్యాన్స్!

Anasuya: అప్పుడు గుంపులో గొవిందా అన్నావ్‌.. మరి ఇప్పుడు చేసిందేంటి అనసూయ?

Chikiri – Chikiri song: పెద్ది చికిరి.. చికిరికి ముహూర్తం ఫిక్స్.. పోస్టర్ వైరల్!

Big Stories

×