OTT Movie : థ్రిల్లర్ సిరీస్ లు చూడటానికే ఆడియన్స్ ఎక్కువ ఓటు వేస్తున్నారు. ఈ మధ్య ఇలాంటి జానర్ లనే తీసేందుకు మేకర్స్ కూడా మక్కువ చూపిస్తున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీలో దుమ్ములేపే థ్రిల్లర్ సిరీస్ లనే సర్చ్ చేస్తున్నారు. అలాంటి టాప్ ఇండియన్ థ్రిల్లర్ సిరీస్ లపై ఓ లుక్ వేద్దాం పదండి. ఈ సిరీస్‌లు క్రైమ్, స్పై, మిథాలజీ, పాలిటిక్స్ బ్యాక్‌డ్రాప్‌లో రియల్ లైఫ్ ఇన్‌స్పైర్డ్ స్టోరీస్‌తో సీట్ ఎడ్జ్ థ్రిల్ ని ఇస్తున్నాయి. ఇవి ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి ? వీటి పేర్లు ఏమిటి అనే వివరాల్లోకి వెళ్తే …
పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, దివ్యేందుల నటనతో, ఈ సిరీస్ ఉత్తరప్రదేశ్ మాఫియా వరల్డ్‌లో గన్స్, గూండాలు, పవర్ స్ట్రగుల్స్ తో మైండ్ బ్లాక్ ట్విస్టులతో నడుస్తుంది. సీజన్ 1 నుంచి 3 వరకు, ఈ యాక్షన్ సిరీస్ లను ఒక్కసారి స్టార్ట్ చేస్తే స్టాప్ చేయలేం. Amazon Prime Video లో ఈ సిరీస్ 8.5/10 ఐయండిబి రేటింగ్ తో స్ట్రీమింగ్ అవుతోంది.
ఆదిత్య రాయ్ కపూర్ దర్శకత్వం వహించిన ‘ది నైట్ మేనేజర్’, MCU ఫేమ్ టామ్ హిడిల్‌స్టన్ నటించిన బ్రిటిష్ సిరీస్ ఆధారంగా రూపొందింది. అనిల్ కపూర్ విలన్‌గా నటించిన ఈ థ్రిల్లర్, మైండ్ ని బెండ్ చేసే ట్విస్టులతో నడుస్తుంది. ప్రతి ఎపిసోడ్ ఒక కొత్త థ్రిల్లింగ్ కంటెంట్ తో ఉత్కంఠతను పెంచుతుంతుంది. జియో హాట్ స్టార్ లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది.
జైదీప్ అహ్లావత్ హీరోగా, ఢిల్లీ అండర్‌వరల్డ్, పాలిటిక్స్, మీడియా కుట్రలు ఎక్స్‌పోజ్ చేసే ఒక మాస్టర్ పీస్. సీజన్ 2లో నాగాలాండ్ మర్డర్ కేస్‌తో మరింత ఇంటెన్స్ అడ్వెంచర్ ని ఇస్తుంది. రియలిస్టిక్ ఇన్వెస్టిగేషన్, పర్ఫెక్ట్ కాస్టింగ్ తో ఇండియా బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ లిస్ట్ లో ఉంది. ఇది ఐయండిబి రేటింగ్ 8.4/10 తో ప్రైమ్ వీడియో లో అందుబాటులో ఉంది.
అర్షద్ వార్సీ, బరున్ సోబ్తీలతో మిథాలజీ, సీరియల్ కిల్లర్ కాంబినేషన్ లో ఈ సిరీస్ రూపొందింది. కిల్లర్ vs ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్స్ తో తిరిగే ఈ సిరీస్ మైండ్ గేమ్స్ తో ఫుల్ గా ఎంటర్టైన్ చేస్తుంది. సీజన్ 2 మరింత హైప్ లో ఉంటుంది. జియో హాట్ స్టార్ లో 8.5/10రేటింగ్ తో స్ట్రీమ్ అవుతోంది.
బరున్ సోబ్తీ, సువిందర్ విక్కీలతో పంజాబ్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఇది ఫ్యామిలీ ట్రామా, పర్సనల్ డెమన్స్ మిక్స్ అయిన ఒక స్లో-బర్న్ థ్రిల్లర్. Netflixలో ఈ సిరీస్ 8.0/10 ఐయండిబి రేటింగ్ తో అందుబాటులో ఉంది.
Read Also : సోదరిని వెతుక్కుంటూ దెయ్యాల కొంపకు… నెక్స్ట్ ట్విస్ట్ కు గూస్ బంప్స్… ఏ ఓటీటీలో ఉందంటే?