Minister Ravi Kumar: ఏపీలో పెరిగిన విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ పోరుబాటకు సిద్ధమైంది వైసీపీ. డిసెంబర్ 27న ఏపీ అంతటా నిరసన తెలపనుంది. నియోజకవర్గాల్లో విద్యుత్ కేంద్రాల అధికారులకు వినతి పత్రం ఇవ్వనున్నారు పార్టీ నేతలు. ఈ వ్యవహారంపై నోరు విప్పారు విద్యుత్ శాఖమంత్రి గొట్టిపాటి రవికుమార్. వైసీపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
విద్యుత్ చార్జీలు పెరగడానికి కారణం మాజీ సీఎం జగన్ రెడ్డి కాదా అంటూ ప్రశ్నించారు మంత్రి. విద్యుత్ ఛార్జీలను వాళ్లే పెంచారని, మళ్లీ వారే ధర్నాకు పిలుపు నివ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రపంచంలో ఆ తరహా వింత పోకడ ఎక్కడా చూడలేదన్నారు. ధర్నా చేయాల్సింది కలెక్టరేట్ల వద్ద కాదని, జగన్ ఇంటి ముందు చేస్తే బాగుండేదన్నారు.
జగన్ ఆందోళనకు పిలుపు నివ్వడం విడ్డూరంగా ఉందన్నారు గొట్టిపాటి రవికుమార్. ట్రూఆప్ ఛార్జీలు పెంపు ముమ్మాటికీ జగన్ పాపమేనన్నారు. పదవి నుంచి దిగే పోయే ముందు ప్రజలపై విద్యుత్ భారం మోపారన్నారు. రేట్ల పెంపుపై ఈఆర్‌సీకి ఎవరు సిఫార్సు చేశారని ప్రశ్నించారు.
ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసన్నారు. 2019లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా జగన్‌కు అప్పగిస్తే, 2024 నాటికి సర్వనాశనం చేశారన్నారు. కావాల్సినవారికి దోచి పెట్టేందుకు అధిక ధరలతో విద్యుత్ కొనుగోలు చేశారన్నారు.
ALSO READ: పరకామణి ఇష్యూ.. 200 కోట్లు, ఆపై సెటిల్‌మెంట్