BigTV English
Advertisement

Feminichi Fathima OTT : కేరళ స్టేట్ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘ఫెమినిచి ఫాతిమా’… ఓటీటీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Feminichi Fathima OTT : కేరళ స్టేట్ అవార్డ్స్ లో దుమ్మురేపిన ‘ఫెమినిచి ఫాతిమా’… ఓటీటీలో రిలీజ్ ఎప్పుడో తెలుసా?

Feminichi Fathima OTT : రీసెంట్ గా థియేటర్లలో విడుదలైన ‘ఫెమినిచి ఫాతిమా’ అనే మలయాళ సోషల్ డ్రామా మూవీ సంచలనం సృష్టించింది. 2025 లో కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకున్న తర్వాత వార్తల్లో నిలుస్తోంది. రెండు ఉత్తమ అవార్డులను ఈ సినిమా చేజిక్కించుకుంది. నటన, దర్శక కేటగిరీల్లో ఈ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ కథ ఫాతిమా అనే గృహిణి చుట్టూ తిరుగుతుంది. ఆమె పరుపును మార్చుకునే ప్రయత్నంలో అనేక అడ్డంకులను ఎదుర్కొంటుంది. ట్రైలర్‌ను అక్టోబర్ 6న విడుదల చేసినప్పటి నుంచి ఈ సినిమా మీద అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ అవార్డులు ఎవరికి వచ్చాయి ? ఎప్పుడు వచ్చాయి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


ఓటీటీలో ఎప్పుడంటే 

‘ఫెమినిచి ఫాతిమా’ చిత్రం అక్టోబర్ 10, 2025న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో షమ్లా హంజా, విజి విశ్వనాథ్, అష్రఫ్ ఉస్తాద్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి ఫాసిల్ ముహమ్మద్ దర్శకుడిగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్‌పై సుధీష్ స్కారియా, థమర్ కెవి నిర్మించారు. ఇది కళ్యాణి ప్రియదర్శన్ నటించిన లోకా చాప్టర్ 1: చంద్రను కూడా నిర్మించింది. ఓటీటీ విడుదల విషయానికొస్తే, నిర్మాతలు ఇంకా ఎటువంటి అధికారిక స్ట్రీమింగ్ వివరాలను ప్రకటించలేదు. అయితే థియేట్రికల్ రన్ పూర్తయిన తర్వాత, ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో ప్రసారం చేయడానికి అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు. అంటే మరో రెండు మూడు వారాలు పట్టే అవకాశం  ఉంది. 2025 నవంబర్ 3న ప్రకటించిన కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల్లో ఈ సినిమాలో అద్భుతమైన నటనకు గాను, శమ్లా హంజా కేరళ రాష్ట్ర ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. దర్శకుడు ఫాసిల్ ముహమ్మద్ ఉత్తమ దర్శకుడిగా అవార్డును గెలుచుకున్నారు.

Read Also : రాకుమారిని వెంటాడే నాగ బంధనం… ఆత్మను ప్రేమించే నరుడు… ఓటీటీలో సరికొత్త థ్రిల్లర్


స్టోరీ ఏమిటంటే

కేరళలోని పొన్నాని అనే ఒక ముస్లిం తీరప్రాంత పట్టణంలో నివసించే ఫాతిమా అనే గృహిణి, తన భర్త అష్రఫ్, ముగ్గురు పిల్లలతో జీవిస్తుంటుంది. ఒక రోజు వీళ్ళ కొడుకు పడుకునే మంచాన్ని తడిపేస్తాడు. దానికి తోడు ఒక కుక్క కూడా పరుపు తడపడంతో దానిని ఇంట్లో ఉంచడానికి భర్త నిరాకరిస్తాడు. ఆ పాత పరుపు నిరుపయోగంగా మారుతుంది. ఫాతిమాకు కొత్త పరుపు కావాలి, కానీ ఆమె దగ్గర డబ్బులు ఉండవు. ఆమె భర్త అనుమతి లేకుండా ఏమీ కొనలేదు. ఫాతిమా కొత్త పరుపు కొనడానికి ప్రయత్నించిన ప్రతిసారీ, అష్రఫ్ ఆమెను అడ్డుకుంటాడు. ఆమె ప్రయత్నాలను చులకన చేస్తాడు. ఆమెను తక్కువ అంచనా వేస్తాడు సంప్రదాయం పేరుతో ఆమె కోరికలను అణచివేస్తాడు. అష్రఫ్ దృష్టిలో ఒక మహిళకు మంచం మార్చడం వంటి నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ఉండకూడదు. చివరికి ఫాతిమా పరుపు కొంటుందా ? డబ్బు ఎలా సంపాదిస్తుంది ? భర్త అనుమతి వస్తుందా ? అనే విషయాలను, ఈ సోషల్ డ్రామా సినిమాని చూసి తెలుసుకోండి.

Tags

Related News

OTT Movie : అమ్మాయిలతో ఆ పాడు పని చేసి చంపే సైకో… ఒంటరిగా చూడాల్సిన సీన్స్… క్లైమాక్స్ కేక

OTT Movie : 240 కోట్ల కలెక్షన్స్, 10 అవార్డులు… ఈ బ్లాక్ బస్టర్ మూవీ హీరోని జైలుకు పంపిందన్న విషయం తెలుసా ?

Kiss movie OTT : కిస్ పెట్టుకుంటే ఫ్యూచర్లోకి… మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి సూపర్ హిట్ తమిళ్ మూవీ

Friday OTT Movies : శుక్రవారం ఓటీటీల్లోకి 17 సినిమాలు.. ఆ 4 వెరీ స్పెషల్..

OTT Movie : ఎక్స్ కంటే డేంజర్ గా ఉండే 5 థ్రిల్లర్ సిరీస్ లు… యాక్షన్ మాత్రమే కాదు మజా ఇచ్చే అడ్వెంచర్ కూడా

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి స్టార్ హీరోల సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

OTT Movie : ‘గేమ్ ఆఫ్ థ్రోన్’కు మించిన కంటెంట్ ఉన్న సిరీస్ మావా… అస్సలు వదలొద్దు

Big Stories

×