Rashmi Gautam (Source: Instragram)
రష్మీ గౌతమ్.. ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీ అనే షోకి కూడా యాంకర్ గా వ్యవహరిస్తోంది.
Rashmi Gautam (Source: Instragram)
జబర్దస్త్ లోకి అడుగుపెట్టకు ముందు పలు సినిమాలలో హీరోయిన్ గా నటించింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు.
Rashmi Gautam (Source: Instragram)
వెండితెరపై అవకాశాలు కనుమరుగవుతున్న నేపథ్యంలో బుల్లితెరకు వచ్చిన రష్మీ ఇక్కడే సెటిల్ అయిపోయింది.
Rashmi Gautam (Source: Instragram)
ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ తో ఆకట్టుకునే రష్మి.. సమాజంలో మూగజీవులకు ఏదైనా అన్యాయం జరిగితే ఇట్టే స్పందిస్తూ ఉంటుంది.
Rashmi Gautam (Source: Instragram)
ఇదిలా ఉండగా మరోవైపు.. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న రష్మీ.. ఇటీవలే అందుకు సంబంధించి సర్జరీ కూడా చేయించుకున్న విషయం తెలిసిందే. ఇక సర్జరీ తర్వాత పెద్దగా మీడియా ముందుకు రాలేదు
Rashmi Gautam (Source: Instragram)
అయితే నిన్న ఈమె పుట్టినరోజు కావడంతో ఒక రెస్టారెంట్ కి వెళ్లిన ఈమె అక్కడ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. సర్జరీ జరిగిన తొమ్మిది రోజుల తర్వాత ఇలా మీ ముందుకు వచ్చాను అంటూ పలు విషయాలు పంచుకున్న రష్మీ అందులో క్యూట్ గా ముద్దు ఇస్తున్నట్టు ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు చూసిన ఫాలోవర్స్ ముద్దు ఎవరి కోసం రష్మి అంటూ కొంటెగా కామెంట్లు చేస్తున్నారు.