Trivikram Srinivas: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడుగా, రూపొందుతున్న సినిమా హరి హర వీరమల్లు. క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో, పీరియాటిక్ యాక్షన్ డ్రామాగా, ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. విడుదలకు వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు నిర్మాతలు తెలిపారు. రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రం ఫైనల్ కట్ లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఆ వివరాలు చూద్దాం..
త్రివిక్రమ్ కనుసన్నల్లోనే హరిహర వీరమల్లు..
హరిహర వీరమల్లు ఒక పిరియాటిక్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా,17వ శతాబ్దంలో మొదటి సామ్రాజ్య నేపథ్యంలో జరిగే కథగా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ చిత్రం మొదటి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత మూవీని జ్యోతి కృష్ణకు అప్పగించారు. ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీ ఫైనల్ కట్ లో కీలక సలహాదారుడిగా పని చేస్తున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ గతంలో జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి వంటి సినిమాలతో కలిసి పని చేశారు. ఇండస్ట్రీలో వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా, పవన్ కళ్యాణ్ కు త్రివిక్రమ్ సలహాదారుడిగా కూడా వ్యవహరిస్తారని టాక్. అందులో భాగంగానే ఎప్పటినుంచో ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్న, హరిహర వీరమల్లు సినిమా ఫైనల్ కట్ లో, త్రివిక్రమ్ సలహా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ మూవీ షూటింగ్ సమయంలో త్రివిక్రమ్ సెట్ లో ఉన్నట్టుగా ఫోటోలు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. త్రివిక్రమ్ ,ఫైనల్ కట్ స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ లో, సలహాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ ప్రేమయంతో ఈ చిత్రం మరింత హైప్ నెలకొంది. ఈ సినిమా ట్రైలర్ కట్ కోసం కసరతులు జరుగుతున్న టైంలో, త్రివిక్రమ్ సలహా తో ట్రైలర్ ప్రేక్షకుల అంచనాలకు, మించి ఉంటుందని సమాచారం.హరిహర వీరమల్లు లో,ఫైనల్ కట్ లాక్ చేసి ఆయన అప్రూవల్ వచ్చాక వదులుతారు. ట్రైలర్ రిలీజ్ డేట్ ను ప్రకటించేందుకు దర్శక నిర్మాతలు సిద్ధమవుతున్నారు.
ఫైనల్ కట్ అప్పుడే నా ..
ఈ మూవీలో బాబీ డియోల్, అనుపమ్ ఖేర్, విక్రమ్ జిత్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. ఈ చిత్రం మెగా సూర్యా ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ ఎం. రత్నం సమర్పణలో, ఏ దయాకర్ నిర్మిస్తున్నారు. సంగీతం ఎం. ఎం కీరవాణి అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ప్రస్తుతం హరిహర వీరమల్లు పార్ట్1 మరి కొద్ది రోజుల్లో థియేటర్లలో సందడి చేయనుంది. మూవీ రిలీజ్ డేట్ కోసం అభిమానులు ఆత్రుత ఎదురుచూస్తున్నారు.
Vennela Kishore : ఆఫ్ట్రాల్ పాస్ పోర్ట్ కోసం మెగాస్టార్ మూవీనే వద్దనుకున్న వెన్నెల కిషోర్