OTT Movie : దూరదర్శన్ నుంచి స్మార్ట్ ఫోన్ ల వరకూ, ఒక సుదీర్ఘ ప్రయాణమే జరిగింది. ఈ ప్రయాణంలో, ఎన్నో హారర్ సినిమాలు, సీరియల్స్ బుల్లి తెరలో ప్రేక్షకులను అలరించాయి. అయితే మునుపుటికంటే ఇప్పుడు థియేటర్లలో సందడి కాస్త తగ్గిందనే చెప్పాలి. ఇప్పుడు ఓటీటీలో సినిమాలను చూడటానికి ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. థియేటర్లలో వచ్చే సినిమాలు, ఓటీటీ లోకి రావడానికి ఎంతో సమయం పట్టడం లేదు. అందుకే ఓటీటీ వైపు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమాలో ఒక శవం చేసే రచ్చ మామూలుగా ఉండదు. చచ్చిపోయిన శవం లేచి మార్చురీలో పరగులు పెట్టిస్తుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
మేఘన్ రీడ్ అనే మహిళ డ్రగ్ వ్యసనంతో పోలీసు జాబ్ కూడా పోగొట్టుకుంటుంది. ఇప్పుడు ఆ డ్రగ్ వ్యసనంతో పోరాడుతూ, తన జీవితాన్ని తిరిగి సరిదిద్దుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమె ఒక ఆసుపత్రి మార్చురీలో, నైట్ షిఫ్ట్ ఉద్యోగం సంపాదిస్తుంది. ఇక ఈ సినిమాలో అసలు స్టోరీ ఇప్పుడే మొదలౌతుంది. మేఘన్ డ్యూటి చేస్తున్న సమయంలో, హన్నా గ్రేస్ అనే యువతి శవం మార్చురీకి వస్తుంది. హన్నా గ్రేస్ ఒక భయంకరమైన ఎక్సార్సిజం సమయంలో మరణించినట్లు తెలుస్తుంది. అయితే ఆహానిపోయినా కూడా ఆమె శరీరంలో కదలికలు వస్తాయి. ఆ శవం అసాధారణంగా ప్రవర్తిస్తుంది. హన్నా శరీరంలో ఒక దుష్టశక్తి ఉందని మేఘన్‌కి అనుమానం కలుగుతుంది.
ఆ శవం చేసే వింత శబ్ధాలకు, మేఘన్ భయపడుతూనే, ధైర్యం తెచ్చుకుంటూ ముందుకు వెళ్తుంది. మార్చురీలో భయంకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మేఘన్ ఈ దుష్టశక్తిని ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ హన్నా గ్రేస్ మరణానికి కారణమైన ఎక్సార్సిజం వివరాలు క్రమంగా బయటపడతాయి. చివరికి మేఘన్ ఆ దుష్టశక్తిని ఎలా ఎదుర్కొంటుంది ? ఆమె జీవితం ఎలా మారుతుంది ? హన్నా గ్రేస్ మరణం వెనుక అసలు రహస్యం ఏమిటి ? అనే విషయాలను, ఈ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోండి.
Read Also : నట్ట నడి సముద్రంలో జైలు… ఈ క్రిమినల్స్ వేసిన మాస్టర్ ఎస్కేప్ ప్లాన్ కు దిమ్మ తిరగాల్సిందే
నెట్ ఫ్లిక్స్ (Netflix) లో
ఈ సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది పొసెషన్ ఆఫ్ హన్నా గ్రేస్'(The Possession of Hannah Grace). 2018 లో వచ్చిన ఈ అమెరికన్ మూవీకి డైడెరిక్ వాన్ రూయిజెన్ దర్శకత్వం వహించారు. ఇందులో షే మిచెల్, కిర్బీ జాన్సన్, స్టానా కాటిక్, గ్రే డామన్, నిక్ థూన్ వంటి నటులు నటించారు. ఈ సినిమా స్టోరీ మేఘన్ రీడ్ అనే ఒక యువతి చుట్టూ తిరుగుతుంది. ఈ మూవీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ (Netflix) లో స్ట్రీమింగ్ అవుతోంది.