BigTV English

Viral Video: నడి రోడ్డుపై రీల్స్.. ఇంతలో వేగంగా వచ్చిన కారు, అంతా ఎగిరిపడ్డారు!

Viral Video: నడి రోడ్డుపై రీల్స్.. ఇంతలో వేగంగా వచ్చిన కారు, అంతా ఎగిరిపడ్డారు!

ఈ రోజుల్లో యువత సోషల్ మీడియాకు బానిసలుగా మారారు. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ అంటూ ప్రతి మూమెంట్ ను ఫోటో తీసి సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ తో పంచుకుంటున్నారు. ఇక ఇన్ స్టాలో లైకుల కోసం, ఫాలోవర్స్ ను పెంచుకునేందుకు పడుతున్న తిప్పల గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మాయిలైతే అంగాంగ ప్రదర్శన చేయడం, అబ్బాయిలైతే డేంజరస్ స్టంట్లు చేయకడం కామన్ అయ్యింది. ఒక్కోసారి ఈ అతి చేష్టలు ప్రాణాల మీదికి తీసుకొస్తున్నాయి. రీల్స్ చేస్తూ యువతి మృతి, యువకుడు మృతి అంటూ తరచుగా న్యూస్ వింటూనే ఉన్నాం. అయినా, చాలా మంది పద్దతి మార్చుకోవడం లేదు.


రీల్స్ చేస్తుండగా వెనుక నుంచి ఢీకొట్టిన కారు

కొంత మంది యువత బైకులతో విన్యాసాలు చేస్తుండగా, మరికొంత మంది రైళ్లలో డేంజరస్ స్టంట్లు చేస్తున్నారు. ఒక్కోసారి టైమ్ బాగాలేక ప్రాణాలు కోల్పోతున్నారు కూడా. ఎక్కడ పడితే అక్కడ రీల్స్ చేయడం డేంజర్ అని తెలిసినా పద్దతి మార్చుకోవడం లేదు. తాజాగా ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. సుమారు ఐదుగురు యువకులు, ఓ యువతి కలిసి రోడ్డు మీద రీల్స్ చేస్తుండగా అనుకోని ఘటన జరిగింది. అమ్మాయి చేతిలో చేయి వేసి ఓ యువకుడు డాన్ లా నడిచి వస్తుండగా, ఆయన వెనుక లెఫ్ట్ సైడ్ ఇద్దరు, రైట్ సైడ్ ఇద్దరు బాడీ గార్డుల మాదిరిగా కవర్ చేస్తూ వస్తున్నారు. రీల్ మొదలు పెట్టిన సుమారు 5 సెకెన్ల తర్వాత వెనుక నుంచి ఓ కారు స్పీడ్ గా దూసుకొచ్చింది. రీల్స్ చేస్తున్న వారిని ఢీకొట్టింది. కారు స్పీడ్ కు నలుగురు యువకులు ఎగిరిపడ్డారు.


Read Also: భార్యకు 20 సంచుల చిల్లర ఇచ్చిన భర్త.. ఇదెక్కడి రివెంజ్ మామ!

Read Also: పొరుగు దేశాల్లోనూ పద్ధతి మారదా? ఫిన్లాండ్ రైల్లో ఆ ఇండియన్ ఫ్యామిలీ ఏం చేశారంటే?

పలువురు యువకులకు తీవ్ర గాయాలు

ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. కారు స్పీడ్ ధాటికి కారు మీదికి ఎగిరి, రోడ్డు మీద పడ్డారు. యాక్సిడెంట్ జరిగిన విధానం చూస్తుంటే మాత్రం గట్టిగానే గాయాలు అయినట్లు తెలుస్తున్నది. అయితే, యాక్సిడెంట్ తర్వాత ఏం జరిగింది అనేది పూర్తి వీడియో మాత్రం లేదు. ఈ ఘటన నార్త్ స్టేట్స్ లో జరిగినట్లు తెలుస్తున్నది. అయితే, కచ్చితంగా ఎక్కడ జరిగింది అనే విషయంలో క్లారిటీ లేదు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయ్యో పాపం అని కొంత మంది జాలి చూపిస్తుంటే, రోడ్డు మీద తింగరి వేశాలు వేస్తే ఇలాగే జరుగుతుందని మరికొంత మంది కామెంట్స్ పెడుతున్నారు. యువత ఇలాంటి వీడియో చూసైనా పద్దతి మార్చుకోవాలని పలువురు సూచిస్తున్నారు. సోషల్ మీడియాలో లైకుల కోసం ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని హితవు పలుకుతున్నారు. ప్రాణం పోతే రాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.

Read Also: లేడీస్ హాస్టల్‌లో అనకొండ.. 17 అడుగుల పొడవు, 100 కిలోల బరువు, వీడియో వైరల్!

Related News

Viral Video: పిల్లలా? నా వల్ల కాదు.. ఆడ సింహన్ని చూసి మృగరాజు పరుగోపరుగు!

Marriage: శోభనం రాత్రి.. బాల్కనీ నుంచి దూకిన వధువు.. కట్ చేస్తే, పెద్ద స్కామ్!

Monkey video viral: కోతి తలకు పగడి ధరించి.. ఓ మోడల్ లాగా..? వీడియో మస్త్ వైరల్

Hyderabad News: మిడ్ నైట్ రోడ్లపై హంగామా.. ఓ చేతిలో బాటిల్.. మరో చేతిలో, కెమెరాకి చిక్కాడు

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Big Stories

×