OTT Movie : సమురాయ్ అంటేనే జపాన్ గుర్తుకు వస్తుంది. ఇక పురాతన కాలంలో వీళ్ళు చేసే విన్యాసాలను రకరకాలుగా చెప్పుకుంటారు. కత్తులను మెరుపు వేగంతో తిప్పుతూ, ఎదుటి వాళ్ళ ప్రాణాలను సెకన్ల వ్యవధిలోనే తీసేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఒక వెబ్ సిరిస్ ఓటీటీలోకి రంగ ప్రవేశం చేస్తోంది. ఇది 19వ శతాబ్దం చివరలో మెయిజీ కాలంలో ఈ కథ నడుస్తుంది. ఈ సిరీస్ టోక్యో లోని టెన్ర్యుజీ ఆశ్రమంలో జరుగుతుంది. కొంత మంది యోధులు డబ్బు కోసం ఒక గేమ్ అడుతారు. ఇది చాలా భయంకరంగా జరుగుతుంది. స్క్విడ్ గేమ్ మించి ఈ సిరీస్ ఉంటుంది. ఇది ఏ ఓటీటీలోకి వసుంది ? ఎప్పుడు వస్తుంది ? దీని పేరు ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘లాస్ట్ సమురాయ్ స్టాండింగ్’ (Last samurai standing) జపనీస్ నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ లైవ్ యాక్షన్ సిరీస్. ఇది షోగో ఇమామురా రాసిన నవల ఆధారంగా, కట్సుమి టాట్సుజావా రూపొందించారు. ఇందులో జునిచి ఒకాడా, యుమియా ఫుజిసాకి, కయా కియోహరా నటించారు. ఈ సిరీస్ మొదటి రెండు ఎపిసోడ్‌లు 2025 సెప్టెంబర్ 18న ‘ఆన్ స్క్రీన్’ విభాగంలో 30వ బుసాన్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడ్డాయి. మిగతా 6 ఎపిసోడ్ లు 2025 నవంబర్ 13న నెట్‌ఫ్లిక్స్‌లో ప్రపంచవ్యాప్తంగా ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుంది.
Read Also : యాక్షన్ లేదు, రొమాన్స్ లేదు… IMDbలో 7.4 రేటింగ్… హృదయాన్ని హత్తుకునే ఫ్యామిలీ డ్రామా
ఈ స్టోరీ 1878లో జపాన్‌లో, మీజీ కాలంలో జరుగుతుంది. సమురాయ్‌ల పతనం తర్వాత 10 సంవత్సరాలు గడిచాయి. 292 మంది నైపుణ్యం కలిగిన యోధులు తమ హోదాను కోల్పోయి, పేదరికం, కలరా వ్యాధితో పోరాడుతూ జీవిస్తుంటారు. 100 బిలియన్ల భారీ నగదు బహుమతి ఆశతో వారంతా క్యోటోలోని టెన్ర్యూజి ఆలయం వద్దకు చేరుకుంటారు. అక్కడ వారిని ఒక క్రూరమైన, ప్రాణాంతకమైన గేమ్‌లోకి పంపబడతారు. ఈ గేమ్ లో పాల్గొనేవారికి ఒక చెక్క ట్యాగ్ ఇవ్వబడుతుంది. వాళ్ళు తమ ప్రత్యర్థుల ట్యాగ్‌లను దొంగిలించాలి. టోక్యోకు ప్రాణాంతకమైన ప్రయాణంలో ప్రాణాలతో బయటపడాలి. చివరికి మిగిలిన ఒక వ్యక్తి బహుమతిని గెలుచుకుంటాడు. ఒకప్పుడు భయంకరమైన సమురాయ్‌గా ఉన్న షుజిరో సాగా అనే వ్యక్తి, తన అనారోగ్యంతో ఉన్న భార్య, బిడ్డను రక్షించాలనే ఒకే లక్ష్యంతో ఈ గేమ్‌లో ప్రవేశిస్తాడు. చివరికి ఈ గేమ్ లో ఎవరైనా ప్రాణాలతో బయట పడతారా ? నగదు బహుమతి ? ఎవరికి దక్కుతుంది ? షుజిరో తన ఫ్యామిలీని కాపాడుకుంటాడా ? అనే విషయాలను, ఈ యాక్షన్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.