BigTV English
Advertisement

OTT Movie : ఇదేందయ్యా ఇదీ… సినిమా కోసం సీరియల్ కిల్లర్ తో… నెక్స్ట్ గుండె బద్దలయ్యే ట్విస్ట్

OTT Movie : ఇదేందయ్యా ఇదీ… సినిమా కోసం సీరియల్ కిల్లర్ తో… నెక్స్ట్ గుండె బద్దలయ్యే ట్విస్ట్

OTT Movie : ఓటీటీలోకి డిఫెరెంట్ కంటెంట్ ఉన్న స్టోరీలను తీసుకొచ్చేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు మేకర్స్. అలాగే మంచి కంటెంట్ ఉన్న స్టోరీలను భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అలాంటి డిఫరెంట్ స్టోరీ ఉన్న ఒక సిరీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇది ప్రేమ, సీరియల్ కిల్లింగ్ థీమ్స్ తో నడుస్తుంది. రెండు పార్ట్స్ గా వస్తున్న ఈ సిరీస్ నెల రోజుల గ్యాప్ లో రెండూ స్ట్రీమింగ్ అవుతాయి. ఇక థ్రిల్లర్ ఫ్యాన్స్ బింజ్ వాచ్ కి సిద్ధంగా ఉండండి. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలోకి రాబోతోంది ? ఎప్పుడు వస్తుంది ? అనే విషయాలను తెలుసుకుందాం పదండి.


నెట్‌ఫ్లిక్స్‌లో

‘హాడ్ ఐ నాట్ సీన్ ది సన్ (Had I Not Seen the Sun) తైవానీస్ డార్క్ మిస్టరీ రొమాంటిక్ థ్రిల్లర్ సిరీస్. దీనిని చియాంగ్ చి-చెంగ్, చియెన్ చి-ఫెంగ్ రూపొందించారు. ఇందులో జెంగ్ జింగ్-హువా, మూన్ లీ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సిరీస్ పార్ట్ 1 : 2025 నవంబర్ 13, పార్ట్ 2 : డిసెంబర్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది.

Read Also : కుర్రాడి నుంచి పండు ముసలిదాకా ఎవ్వర్నీ వదలని అమ్మాయి… ఇదెక్కడి తేడా యవ్వారంరా సామీ ?


స్టోరీ ఏమిటంటే

25 ఏళ్ల లీ జెన్ అనే యువకుడు తన హైస్కూల్ క్లాస్‌మేట్స్‌ను చంపేసి, తనకు తానుగా పోలీస్ స్టేషన్‌లో సరెండర్ అవుతాడు. అతను “రెయిన్‌స్టార్మ్ కిల్లర్” అనే పేరుతో ఈ హత్యలు చేశానని అంగీకరిస్తాడు. అయితే చంపిన వివరాలు చెబుతాడు కానీ ఎందుకు చంపాడో మాత్రం చెప్పడు. ఇదే సమయంలో ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ జౌ పిన్, అతన్ని జైల్లో ఇంటర్వ్యూ చేస్తుంది. ఇక్కడి నుంచి మిస్టరీ స్టార్ట్ అవుతుంది. ఇంటర్వ్యూ తర్వాత జౌకి వింత కలలు వస్తాయి. ఒక చనిపోయిన స్టూడెంట్ ఆత్మ కూడా ఆమెకు కనిపిస్తుంది. ఇప్పుడు లీ జెన్ పాస్ట్ లో కూడా హైస్కూల్ లవ్ స్టోరీ, హార్ట్ బ్రేక్ ఎమోషన్స్ బయటపడుతాయి. ఒక బ్యాలెట్ డాన్సర్ గర్ల్‌తో లవ్ స్టోరీ మిస్టరీగా నడిచిందని తెలుస్తుంది. చివర్లో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ తో ట్రూత్ రివీల్ అవుతుంది. లవ్ ఎలా డార్క్‌ నెస్‌కి దారి తీస్తుందో ఈ సిరీస్ చూపిస్తుంది. ఆ మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ ఏమిటి ? లీ జెన్ అమ్మాయిలను చంపడానికి అసలు కారణం ఏమిటి ? ఫిల్మ్ మేకర్ జౌ పిన్ కి ఎందుకు ఘోస్ట్ కలలు వస్తున్నాయి ? ఈ సిరీస్ ఎలా ముగుస్తుంది ? అనే విషయాలను, ఈ మిస్టరీ రొమాంటిక్ థ్రిల్లర్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.

 

Related News

OTT Movie : అనామకుల పక్కన పడుకుంటేగానీ నిద్ర పట్టని విడ్డూరం… ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి భయ్యా

OTT Movie : ఇంటికొచ్చిన అబ్బాయిని టెంప్ట్ చేసి ఆ పని… కనక వర్షం కోసం మైండ్ బెండింగ్ క్రైమ్ ప్లాన్

OTT Movie : బ్లడీ బ్లడ్ గేమ్… చావు లేదా బతుకు రెండే ఆప్షన్స్… అల్టిమేట్ యాక్షన్ సీన్స్

OTT Movie : భార్యనే ఛీటింగ్ చేసే భర్త… ఒకే ఒక్క బుక్ తో ఆమె ఇచ్చే ట్విస్ట్ కు దిమాక్ కరాబ్

OTT Movie : 100 గంటలు… టీనేజర్ ను కిడ్నాప్ చేసి లైవ్ లోనే ఆ పాడు పని… మెంటలెక్కించే రియల్ క్రైమ్ స్టోరీ

OTT Movie : లైఫ్ లోనే ఫస్ట్ డేట్… కట్ చేస్తే దెయ్యంగా మారే అబ్బాయి… అదిరిపోయే హర్రర్ కామెడీ మూవీ

OTT Movie : తల్లికొడుకులపై పగ తీర్చుకునే దుప్పి… జంతువులకు కూడా ఎమోషన్స్ ఉంటాయి మావా

Big Stories

×