మిస్సమ్మ అంజు వేసిన డ్రాయింగ్ చూస్తూ ఉంటే అప్పుడు అక్కడకు అంజు, ఆనంద్ వస్తారు. ఏంటి మిస్సమ్మ నేను గీసిన డ్రాయింగ్ నీకు అంత బాగా నచ్చిందా అంతలా చూస్తున్నావు అని అంజు అడగ్గానే.. నా కడుపులో బిడ్డను కళ్లతో చూస్తున్నట్టు ఉంది అంజు. నాకు పుట్టబోయే బిడ్డను పుట్టక ముందే చూపించావు. పుట్టే బిడ్డ ఇలాగే ఉంటుందని నీకెలా తెలుసు అంజు అని మిస్సమ్మ అడగ్గానే.. దీని ముఖం దీనికి అసలు డ్రాయింగే తెలియదు ఏదో తోచినట్టు గీసింది అంతే అని ఆనంద్ చెప్పగానే.. అవును మిస్సమ్మ నాకు తోసినట్టి గీశాను. ఇంత బాగా వస్తుందని నీకు డాడీకి బాగా నచ్చుతుందని నేను అసలు అనుకోలేదు.
డ్రాయింగ్‌లో నేను స్కూల్‌లో ఫెయిల్ అయినా ఇంట్లో మాత్రం పాస్ అయిపోయాను అంటుంది అంజు.. దీంతో మిస్సమ్మ నవ్వుతూ ఇంత మంచి బొమ్మ గీసి ఇచ్చినందుకు చాలా థాంక్స్ అంజు.. థాంక్యూ సో మచ్ అనగానే.. ఉత్తి థాంక్స్ యేనా..? గిప్ట్ లేదా అని అడుగుతుంది అంజు. ఏం కావాలి అని మిస్సమ్మ అడగ్గానే.. అలా అడుగు మిస్సమ్మ దీన్ని బేకరికి తీసుకెళ్లి బోలెడన్ని ఎగ్ ఫప్పులు చాక్లెట్స్ ఇవ్వు చాలు అని ఆనంద్ చెప్తాడు. అప్పుడు అంజు నాకు అవేం వద్దు నేను మర్చిపోలేని వెరైటీ గిఫ్ట్ కావాలి అని అంజు అడగ్గానే.. అయితే పుట్టబోయే బేబీని నీకు గిఫ్ట్‌గా ఇస్తాను అని మిస్సమ్మ చెప్పగానే.. ఆశ్చర్యంగా పుట్టబోయే బేబీనా..? అని అంజు అడగ్గానే.. అవును బేబీ పుట్టగానే నీ చేతుల్లో పెట్టేస్తాను.. తన అక్కగా నువ్వే ఆ బేబీని చూసుకోవాలి అని మిస్సమ్మ చెప్పగానే.. అంజు వద్దు మిస్సమ్మ అంటుంది.
దీంతో ఆనంద్ అదేంటే నీకు చెల్లి వద్దా అంటాడు. చెల్లికి తల్లి కావాలి.. అమ్మ చేతుల్లోనే చెల్లి పెరగాలి అని అంజు చెప్పగానే.. ఎందుకు అంజు ఎందుకు అలా అంటున్నావు అని మిస్సమ్మ అడగ్గానే.. ఎందుకంటే అమ్మ లేని లోటు మాకు తెలుసు మిస్సమ్మ.. అంటూ అంజు చెప్పగానే.. ఆనంద్ కూడా కరెక్టు మిస్సమ్మ అమ్మ లేకుండ మేము పెరుగుతున్నట్టు మా చెల్లి పెరగకూడదు.. అంటాడు. చెల్లి పెరిగి పెద్దది అయ్యే వరకు నువ్వు తనతోనే ఉండాలి మిస్సమ్మ.. మేము అమ్మను మిస్ అయినట్టు చెల్లి నిన్ను మిస్ అవ్వకూడదు అంటూ ఎమోషనల్ అవుతుంది.
దీంతో మిస్సమ్మ కూడా ఏడుస్తూ చెల్లినే కాదు మిమ్మల్ని కూడా ఎప్పటికీ మిస్ చేసుకోను.. అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటాను ప్రామిస్.. ఇంతకీ చెల్లికి ఏం పేరు పెడదాం అని అడగ్గానే.. అంజు నువ్వే చెప్పు అనగానే.. అరుంధతి అని పెడదాం అని మిస్సమ్మ చెప్పగానే.. అనంద్ వద్దు మిస్సమ్మ అది అమ్మ పేరు చెల్లిని ఆ పేరు పెట్టి పిలవడం మాకు చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పగానే.. ఏం కాదు అమ్మను మీ నాన్న ఆరు అని పిలిచే వారు కదా మీరు కూడా చెల్లిని ఆరు అని పిలవచ్చు అని మిస్సమ్మ చెప్పగానే.. పిల్లలు హ్యాపీగా ఫీలవుతారు.
మనోహరి రూంలో ఏదో ఆలోచిస్తుంటే.. చంభా వెళ్తుంది. భోజనానిక రమ్మని పిలుస్తుంది. ఏంటి ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. దీంతో మనోహరి తన ప్లాన్ చెప్తుంది. మిస్సమ్మను చంపేందుకు తాను వేసిన ప్లాన్ మొత్తం చెప్తుంది. ఇంకొద్ది సేపట్లో బ్లాక్ మ్యాన్ వచ్చి ఇంట్లో స్మోక్ బాంబ్ వేస్తాడు. ఆ పొగ పీల్చుకుని ఆ భాగీ చచ్చిపోతుంది అని చెప్తుంది. మనోహరి చెప్పినట్టుగానే.. బ్లాక్ మ్యాన్ వచ్చి హాల్లో కూర్చున్న అంజు, మిస్సమ్మల ముందు స్మోక్ బాంబ్ వేసి డోర్ క్లోజ్ చేసి వెళ్లిపోతాడు. ఆ పొగ పీల్చిని మిస్సమ్మ కళ్లు తిరిగి కింద పడిపోతుంది. అప్పుడే అమర్ ఇంటికి వస్తుంటాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.