E-Paper
Advertisement

OTT Movie : అనామకుల పక్కన పడుకుంటేగానీ నిద్ర పట్టని విడ్డూరం… ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి భయ్యా

OTT Movie : అనామకుల పక్కన పడుకుంటేగానీ నిద్ర పట్టని విడ్డూరం… ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయి భయ్యా
Advertisement

OTT Movie : రొమాంటిక్ కామెడీ జానర్ లో వచ్చిన ఒక ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ ను, ప్రేక్షకులు చూసేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నిజ జీవితంలో భార్యాభర్తలైన ఒడెట్ అనబుల్, మరియు డేవ్ అనబుల్ నటించారు. ఇది సినిమాకు ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీతో నడిచే ఈ స్టోరీకి, ఆడియన్స్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..

ఏ ఓటీటీలో ఉందంటే

‘No Sleep ‘Til Christmas’ 2018 లో వచ్చిన రొమాంటిక్ కామెడీ సినిమా. ఫిల్ ట్రైల్ దర్శకత్వంలో ఇది తెరకెక్కింది. ఇది ఫ్రీఫార్మ్ (Freeform) ఛానెల్ కోసం రూపొందించబడిన ఒక ఒరిజినల్ టెలివిజన్ చిత్రం. ఇందులో ఒడెట్ అనబుల్, డేవ్ అనబుల్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2018 డిసెంబర్ 10న యునైటెడ్ స్టేట్స్ లో రిలీజ్ అయింది. ప్రస్తుతం prime video లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

కథ లోకి వెళ్తే

Advertisement

లిజ్జీ అనే బిజీ ఈవెంట్ ప్లానర్‌కు దీర్ఘకాలిక నిద్రలేమి సమస్య ఉంటుంది. ఆమె క్రిస్మస్ రోజున పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఒక రాత్రి కారు డ్రైవింగ్ చేస్తుండగా, అనుకోకుండా ఆమెకు బిల్లీ అనే బార్టెండర్ తగులుతాడు. అతనికి కూడా నిద్రలేమి సమస్య ఉంటుంది. ఆసుపత్రి పార్కింగ్ స్థలంలో, వీరిద్దరూ ఒకరి పక్కన ఒకరు కూర్చుంటారు. అయితే విచిత్రంగా వీళ్ళకు నిద్ర ముంచుకొస్తుంది. దీంతో వీళ్ళు కలసి ఉన్నప్పుడు మాత్రమే ప్రశాంతంగా నిద్రపోగలరని ఆశ్చర్యంగా తెలుసుకుంటారు. దీంతో
లిజ్జీ తన పెళ్లి నాటికి నిద్రపోయేలా సహాయం చేస్తే, బిల్లీకి బార్ ప్రారంభించడానికి డబ్బు అప్పుగా ఇస్తానని ఒక డీల్ ఇస్తుంది.

Read Also : తాత వల్ల నలిగిపోయే కూతురు, మనవడు… గుండెను పిండేసే రాశి ఫ్యామిలీ ఎంటర్టైనర్

Advertisement

ఈ ఒప్పందం ప్రకారం, వాళ్ళు రహస్యంగా కలిసి నిద్రపోవడం ప్రారంభిస్తారు. ఈ క్రమంలో వాళ్ళ మధ్య సాన్నిహిత్యం పెరిగి, అనుకోకుండా ప్రేమలో పడతారు. ఇది లిజ్జీ పెళ్లి పనులను, ఆమె ప్రస్తుత సంబంధాన్ని, వారి జీవితాలను గందరగోళంలో పడేస్తుంది. ఓ వైపు తన ఫియాన్సీ, మరో వైపు బిల్లీతో వ్యవహారం పీక్ కి వెళ్తుంది. చివరికి ఆమె ఒక్కరినే ఎంచుకునే పరిస్థితి ఏర్పడుతుంది. లిజ్జీ ఎవరిని ఎంచుకుంటుంది ? బిల్లీ వైపే మొగ్గు చూపుతుందా ? ఫియాన్సీ నే పెళ్లి చేసుకుంటుందా ? అనే విషయాలను , ఈ రొమాంటిక్ కామెడీ సినిమాను చూసి తెలుసుకోండి.

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×