BigTV English
Advertisement

Brahmamudi Serial Today November 11th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: స్వప్నను క్షమాపణ అడిగిన రాహుల్‌

Brahmamudi Serial Today November 11th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: స్వప్నను క్షమాపణ అడిగిన రాహుల్‌

Brahmamudi serial today Episode:

ఇంటికి వచ్చిన రాహుల్‌ ను అందరూ తిడుతుంటే తనను క్షమించమని రాహుల్‌ అడుగుతాడు. దీంతో కావ్య ఎవ్వరూ నిన్ను క్షమించరు.. నువ్వు క్షమాపణ అడగాల్సింది అందరిని కాదు స్వప్నను అడగాలి అని చెప్పగానే.. రాహుల్‌ బాధగా స్వప్న దగ్గరకు వెళ్లి.. స్వప్న నేను చేసిన తప్పుల వల్ల ఈ కుటుంబం ఎంత బాధపడిందో నాకు తెలియదు. కానీ నువ్వెంత సఫర్‌ అయ్యావో నాకు తెలుసు. కానీ దారుణం జరిగిపోయింది స్వప్న. ఇప్పుడు నేను మారి మనిషిని అవ్వడం తప్ప నేనేం చేయలేను. కానీ ఈ క్షణమే నాలో మార్పును మీకు చూపించాలి అనుకుంటున్నాను.. ఒక్క అవకాశం ఇవ్వు స్వప్న ఇంకెప్పుడూ నా వైపు తప్పు జరగనివ్వను నేను ఇంకెప్పుడూ నిన్ను బాధపెట్టను అంటాడు.


దీంతో స్వప్న నమ్మకం అనేది రాశులు పోసి ఉండదు రాహుల్‌. కనిపించగానే చేతిలోకి తీసుకోవడానికి.. నమ్మకం అనేది కళ్లకు కనిపించేది కాదు.. మనసుకు అనిపించేది. అది నిరూపణ అవ్వాలి. ఈ ఇల్లు అందరి ఇళ్లలాగా ఓ పది మంది తల దాచుకుంటున్న షెల్టర్‌ కాదు ఎవరెలా పోతున్నా వదిలేయడానికి అందరూ ఒకే మాటగా ఒకే మనసుతో ఒకే ఆలోచనతో పరువు ప్రతిష్టల కోసం బంధాలు పెనవేసుకుని బతుకున్న దేవాలయం.. అలాంటి దేవాలయంలో ఎవరు తప్పు చేసినా మిగిలిన అందరూ బాధపడాల్సి వస్తుంది. అది నువ్వు గుర్తించాలి. భార్యాభర్తల మధ్య క్షమాపణలు కాదు నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం నాకు కలగాలంటే నీ మాటలతో కాదు నీ మనసులో నిరూపించు అని చెప్పి స్వప్న పైకి వెళ్లిపోతుంది. రాహుల్‌ వెళ్లిపోతాడు. వెనకే రుద్రాణి వెళ్లిపోతుంది.

రాహుల్‌ ఆలోచిస్తుంటే.. దగ్గరకు వెళ్లి ఏంట్రా వాళ్లు అన్న మాటలకు అంతలా బాధపడుతున్నావా..? నువ్వు ఏదో తప్పు చేసినట్టు అంతలా కుమిలిపోతున్నావేంట్రా.? అని అడగ్గానే.. నేను చేసిన తప్పులు కుప్పలుగా పెరిగిపోయి నాకే భారంగా మారాయి మమ్మీ.. కనీసం ఏడ్చి అయినా ఆ భారాన్ని దించుకుందామనిపిస్తుంది  అని రాహుల్‌ చెప్పగానే.. రుద్రాణి కోపంగా సిగ్గు లేదురా ఆ మాట అనడానికి తప్పు చేసిన మగాడు ఏడవకూడదురా..? పంతం పట్టిన ఆడది పశ్చాతాప పడకూడదు. అందుకు బెస్ట్‌ ఎగ్జాంపుల్‌ మీ మమ్మీయే.. అసలు నువ్ఉవ ఏం తప్పు చేశావనిరా అంతలా బాధపడుతున్నావు.. తప్పు ఎవరైనా చేశారు అంటే ఈ ఇంట్లో వాళ్లు చేశారు. రేయ్‌ ఒక చోట తప్పు జరిగింది అంటే పరిస్థితులే కారణం అవుతాయి. పరిస్థితులు అంటే పై నుంచి ఏమైనా ఊడిపడతాయా..? పక్కనున్న మనుషులు పెట్టే పరీక్షలేరా పరిస్థితులు అంటే.. ఈ కుటుంబం అతా కలిసి నీకు పరీక్ష పెడుతూనే ఉన్నారు..   అంటూ రాహుల్‌ను రుద్రాణి రెచ్చగొట్టాలని చూస్తే


రాహుల్‌ కోపంగా ఇది నటన కాదు నిజంగానే నేను మారడానికి వాళ్లు నాకిచ్చిన మరో అవకాశం.. ఇప్పుడు కూడా నేను నీ మాట విని మారకపోతే ఈ కుటుంబానికే కాదు.. నా స్వప్నకు కూడా నేను తీరని అన్యాయం చేసిన వాడిని అవుతాను..  అంటూ రాహల్‌ చెప్పడం చాటు నుంచి స్వప్న వింటుంది. ఇక నన్ను మనిషిగా కాదు ఒక పురుగు కన్నా హీనంగా చూస్తారు. ఈ ఇంట్లోంచి శాశ్వతంగా గెంటేస్తారు… అంటూ రాహుల్‌ చెప్పగానే.. రేయ్‌ నీకు పిచ్చి పట్టిందిరా వాళ్లందరి మాటకు నీకు మతిపోయింది. అవన్నీ మాయ మాటలురా నమ్మొద్దు అడుక్కు తింటావు.. అని రుద్రాణి చెప్తుంటే.. జైళ్లో కూర్చుని చిప్ప కూడు తినే కంటే.. ఈ కుటుంబాన్ని నా భార్యను నమ్మి అడుక్కు తినడం ఎంతో గౌరవం మమ్మీ ఈ రోజు రాజ్‌ కావ్య కనక లేకపోయి ఉంటే.. నా గురించి కనక ఆలోచించకుండా ఉంటే చివరికి ఏం జరిగేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది. నేను కూయిలీని చంపానని పోలీసులు నమ్మారు.. ఆధారాలు ఉన్నాయి.. ఇంట్లో వాళ్లు నమ్మారు.. చివరికి నా భార్య కూడా అదే నమ్మింది.

కానీ రాజ్‌, కావ్యలు మాత్రం నమ్మలేదు.. అందుకే నేను తప్పు చేయలేదని సాక్ష్యాధారాలతో సమా నిరూపించి నన్ను ఈ కేసు నుంచి బయటకు తీసుకొచ్చారు.. అంతటితో ఆగకుండా ఇన్ని తప్పులు చేసిన నన్ను కూడా క్షమించి ఇంట్లోంచి కూడా రానిచ్చారు.. ఇంత చేసిన వాళ్ల కోసం నా ప్రాణమైనా ఇచ్చేయాలనిపిస్తుంది మమ్మీ.. కానీ నువ్వు ఇంకా వాళ్లకు ద్రోహం చేయాలి అంటున్నావు.. తప్పు మమ్మీ తప్పు చేస్తున్నావు.. ఆ తప్పు ఇంక నేను చేయను.. అనగానే. దూరం నుంచి వింటున్న స్వప్న ఎమోషనల్‌ అవుతుంది. రేయ్‌ ఇన్ని ఆలోచిస్తే బతకలేవురా..? అని రుద్రాణి చెప్పగానే.. రాహుల్‌ కోపంగా రుద్రాణిని తిడుతూ దయచేసి నాకు సలహాలు ఇవ్వకు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు రాహుల్‌.

రూంలో ఉన్న కావ్యను చూసి రాజ్‌ బాధపడతాడు.  కావ్య వచ్చి రాజ్‌ మూడ్‌ ను మార్చేందుకు ప్రయత్నిస్తుంది. తాను చనిపోయే వరకు తన కోర్కెలు తీర్చమని లిస్ట్‌ రాసి ఇస్తుంది. దీంతో రాజ్‌ షాక్‌ అవుతాడు. కావ్య కోరిక మేరకు చికెన్ మంచూరియా చేస్తుంటే.. ప్రకాష్‌ లేచి వచ్చి చూసి కిచెన్‌లో దెయ్యం వచ్చింది అని భయంతో పారిపోతాడు. అందరిని తీసుకొస్తాడు. అందరూ సైలెంట్‌గా కిచెన్‌లోకి వెళ్తారు. అందరినీ చూసిన రాజ్‌ షాక్ అవుతాడు.. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Intinti Ramayanam Today Episode: అక్షయ్ కు అవని థ్యాంక్స్.. పల్లవి పై కమల్ రివేంజ్.. చక్రధర్ కు దిమ్మతిరిగే షాక్..

GudiGantalu Today episode: మౌనిక ఎంట్రీ తో హ్యాపీ.. రోహిణికి షాక్.. బాలు కోసం మీనా వెయింటింగ్..

Nindu Noorella Saavasam Serial Today November 11th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మిస్సమ్మను చంపేందుకు మనోహరి కొత్త ప్లాన్

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..

Illu Illalu Pillalu Today Episode: ధీరజ్ ను ఆడుకున్న ప్రేమ.. మోసపోయిన భాగ్యం.. నిర్దోషిగా బయటకొచ్చిన నర్మద..

Intinti Ramayanam Today Episode: అవనికి తెలిసిపోయిన నిజం.. చక్రధర్ కు స్ట్రాంగ్ వార్నింగ్.. పల్లవికి మైండ్ బ్లాక్..

Brahmamudi Serial Today November 10th:‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాహుల్ ను విడిపించిన రాజ్, కావ్య     

Big Stories

×