Jubilee Hills By Poll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రారంభం అయింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఈసారి డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ చేశారు. ఒక్కో అభ్యర్థికి ఒక్కో పోలింగ్ ఏజెంట్ పాస్ ఇచ్చారు అధికారులు. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు.. బరిలో దిగిన మరో 58 మంది భవితవ్వం తేలనుంది.
గతంలో పోల్చితే ఈ సారి గంట సమయం అదనంగా కేటాయించారు ఎన్నికల అధికారులు. 139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉప ఎన్నికలో 4లక్షల ఒక వెయ్యి 365 మంది ఓటర్లు అర్హులుగా ఉన్నారు. వారిలో 2లక్షల 8వేల 561 మంది పురుషులు, 1లక్ష 92వేల 779మంది మహిళలు, 25మంది ఇతరులు ఉన్నారు.
అలాగే 139 భవనాలలో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో స్టేషన్‌కు 986 ఓటర్లు ఉన్నారు. అత్యధిక సంఖ్యలో ఓటర్లు పోలింగ్ స్టేషన్ నెంబర్ 9లో 1,233 మంది ఉండగా… అత్యల్పంగా పోలింగ్ స్టేషన్ నెంబర్ 263లో 540మంది ఉన్నారు. 11 పోలింగ్ కేంద్రాల్లో 1,200 కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. 85 ఏళ్లు పైబడిన ఓటర్లు, వికలాంగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం కల్పించారు. నమోదు చేసుకున్న 103 మందిలో 101 మంది ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
యూసుఫ్‌గూడలోని కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో పంపిణీ, స్వీకరణ, లెక్కింపు కేంద్రంగా ఏర్పాటుచేశారు. 42 టేబుళ్లలో లెక్కింపు నిర్వహించబడుతుంది. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో వెబ్‌కాస్టింగ్ జరుగుతుంది. ప్రాంగణం లోపల, వెలుపల సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం
ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్
సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న పోలింగ్
ఎన్నికల నిర్వహణకు 5 వేల మంది సిబ్బంది
139 ప్రాంతాల్లో 407 పోలింగ్ కేంద్రాలు
పోలింగ్ సెంటర్ల వద్ద పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లు pic.twitter.com/YqvL0jUNTO
— BIG TV Breaking News (@bigtvtelugu) November 11, 2025