OTT Movie : థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు ఈ మధ్య వారానికే ఓటీటీలలో దర్శనం ఇస్తున్నాయి. ఇక థియేటర్లతో సంబంధం లేకుండా నేరుగా కూడా విడుదలవుతూ సంచాలానాలు సృష్టిస్తున్నాయి. అలా విడుదల అయిన సినిమానే ‘అనగనగా ఓ అతిథి’. పాయల్ రాజ్‌పుత్ డీ గ్లామర్ రోల్ లో నటించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ అయింది. ఆడియన్స్ వైపు నుంచి కూడా బాగానే రెస్పాన్స్ వచ్చింది. థ్రిల్లర్ ఫ్యాన్స్ కూడా ఒకసారి చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘అనగనగా ఓ అతిథి’ (Anaganaga O Athidhi) 2020లో విడుదలైన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఇది 2018లో కన్నడలో విడుదలైన ‘ఆ కరాళ రాత్రి’ చిత్రాన్ని తెలుగు రీమేక్ చేశారు. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించగా దయాళ్ పద్మనాభన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ట్రైలర్ ను 2020, నవంబరు 17న విడుదల చేయగా, ఈ సినిమా ఆహా ఓటీటీలో 2020 నవంబరు 20న విడుదలైంది. ప్రస్తుతం యూట్యూబ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
ఒక మారుమూల గ్రామంలో నివసించే మల్లిక, ఆమె కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటుంది. ఒక జ్యోతిష్కుడు వారి అదృష్టం రాత్రికి రాత్రే మారుతుందని చెబుతాడు. అదే రోజు రాత్రి, శ్రీనివాస్ అనే ఒక ప్రయాణికుడు అక్కడికి వస్తాడు. చిన్న పని ఉందని వాళ్ళను ఆశ్రయం అడుగుతాడు. అతని వద్ద ఒక సూట్‌కేస్ నిండా డబ్బు, బంగారం ఉన్నట్లు కుటుంబ సభ్యులకు తెలుస్తుంది. దీంతో వాళ్ళు అతనికి ఆ ఇంట్లో ఉండటానికి అనుమతి ఇస్తారు. అయితే స్టోరీ ఇప్పుడు డార్క్ టర్న్ తీసుకుంటుంది. ఉన్నట్టుండి ఆ ఫ్యామిలీ మారిపోతుంది.
Read Also : చేతబడులతో చచ్చి బతికే కుటుంబం… ‘విరూపాక్ష’ను మించిన బ్లాక్ మ్యాజిక్ మరాఠీ మూవీ తెలుగులో
పేదరికం, అత్యాశతో ఆ డబ్బును సొంతం చేసుకోవడానికి ఒక దుర్మార్గమైన ప్లాన్ వేస్తారు. అతన్ని చంపి డబ్బును సొంతం చేసుకోవాలనుకుంటారు. ఆ ఒక్క రాత్రిలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. మోసం, క్రూరత్వం పర్యవసానాల చుట్టూ కథ తిరుగుతుంది. అయితే వాళ్ళు ఒకటనుకుంటే, స్టోరీ మరోలా తిరుగుతుంది. ఇక ఈ క్లైమాక్స్ ట్విస్ట్ ఈ సినిమాకి ప్రాణం లాంటిదనే చెప్పుకోవాలి. చివరికి వీళ్ళు డబ్బును సొంతం చేసుకుంటారా ? ఆ వచ్చిన వ్యక్తిని చంపుతారా ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను, ఈ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమాని చూసి తెలుసుకోండి.