Bigg Boss 9 Telugu: బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ షో కి రోజు రోజుకి ఆదరణ పెరుగుతూనే ఉంది. ఆడియో సినిమా కట్టుకునే విధంగా బిగ్ బాస్ డిఫరెంట్ కంటెంట్ ను ప్రేక్షకులకు అందిస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. ఒకవైపు విమర్శలకు ఎదురవుతున్న మరోవైపు మాత్రం షో కి డిమాండ్ తగ్గట్లేదు. తెలుగులో ఇప్పటికే ఎనిమిది సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం 9 వ సీసల్ని జరుపుకుంటుంది. ఈ షో మొదలు అయ్యి 9 వారాలు పూర్తయింది. 9వ వారం సాయి శ్రీనివాస్ హౌస్ నుంచి ఎలిమినెట్ అయ్యారు.. ఇక పదో వారం ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్తారా అన్న ఆసక్తి నెలకొంది.. టాప్ పొజిషన్ లో లేకపోయినా సరే ప్రస్తుతం హౌస్ లో ఉన్న అందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్. ఈవారం నామినేషన్స్ పోటా పోటీగా జరిగాయి.. హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వస్తారోనని జనాలు వెయిట్ చేస్తున్నారు. ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో ఒకసారి చూద్దాం..
బిగ్ బాస్ సీజన్ 9 మరి కొన్ని వారాల్లో ముగియనుంది. గత వారం వరకు ఎవరు ఎలిమెంట్ అవుతారా అన్న ఆసక్తి జనాల్లో కనపడింది. కానీ ఇప్పుడు మాత్రం ఈ సీజన్ విన్నర్ ఎవరో అవుతారు అన్న ఆలోచనలు పడ్డారు. గతవారం నటుడు సాయి శ్రీనివాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు.. తక్కువ ఓటింగ్ నమోదు కావడంతో హౌస్ నుంచి బయటకు వచ్చేసాడు. ఇక పదో వారం నామినేషన్స్ హీటేక్కించాయి. ఈ నామినేషన్స్ లో భరణి, రీతూ, దివ్య, నిఖిల్, గౌరవ్, సంజన ఉన్నారు. ఎక్కువ మంది మాత్రం గౌరవ్ ను నామినేట్ చేశారు. మొత్తం ముగ్గురు సభ్యులు గౌరవ్‌ని నామినేట్ చేశారు. తర్వాత దివ్య, నిఖిల్ ఇద్దరికీ చెరో రెండు నామినేషన్స్ వచ్చాయి. ఇక నామినేషన్స్ లిస్ట్ గమనిస్తే గౌరవ్-నిఖిల్ ఇద్దరికీ ఈ టఫ్ గా ఉండే అవకాశం ఉంది..
Also Read : బిగ్ బాస్ షోకు బిగ్ షాక్.. బ్యాన్ చెయ్యాలంటు డిమాండ్.. ఏం జరిగిందంటే..?
బిగ్బాస్ తెలుగు పదోవారం నామినేషన్స్ మాత్రం ప్రేక్షకులను ఆత్రుతగా ఎదురుచూసేలా చేస్తున్నాయి.. ఈవారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారా అన్న ఆసక్తి గత కొద్ది రోజులుగా నెలకొంది. నామినేషన్స్ ప్రకారం చూస్తే డేంజర్ లో గౌరవ్, నిఖిల్ ఉన్నారు. ఈవారం వీళ్లిద్దరూ హౌస్ నుంచి బయటికి వచ్చే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత వారం డబల్ ఎలిమినేషన్ అవడంతో.. ఈవారం ఒకరిని మాత్రమే ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. మరి గౌరవ్ లేదా నిఖిల్ ఇద్దరు ఎవరు బయటకు వెళ్తారో చూడాలి.. ఇకపోతే ఇమ్మానియేల్ తనూజ భరణి ఈ ముగ్గురు కూడా పోటీపడి మరి ఈవారం టాప్ లోకి వచ్చేసారు. సీజన్ ముగింపు దగ్గర పడటంతో ఈ సీజన్ కి విన్నర్ ఎవరు అన్నది మాత్రం జనాల్లో ఉత్కంఠగా మారింది..