Delhi Red Fort blast Update: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సిగ్నల్ వద్ద కారు ఆగడతో పేలుడు సంభవించింది పోలీసులు, దర్యాప్తు బృందాలు అనుమానిస్తున్నాయి. పేలిన హ్యుందాయ్ i20 కారు యజమాని తారిఖ్. అతడు జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాకు చెందిన వ్యక్తి అని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. దీంతో పేలుడు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
ఎర్రకోట పేలుడు ఘటనలో కొత్త విషయాలు
సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సంభవించిన పేలుడుపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ ఘటనలో 8 మంది చనిపోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. రెండు డజన్ల మంది గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. రెండు మృతదేహాలు గుర్తించారు పోలీసులు. ఒకరు ఉత్తర ప్రదేశ్ వాసి కాగా, మరొకడి మృతదేహం ఢిల్లీకి చెందిన వ్యక్తి. మృతుల్లో అందరూ పురుషులే ఉన్నారు.
సోమవారం సాయంత్రం నిన్న సాయంత్రం 6.52 గంటలకు పేలుడు చోటు చేసుకుంది. ఆ సమయంలో ఎర్రకోట సమీపంలోని పార్కింగ్ స్థలంలో మూడు గంటల పాటు ఐ20 కారు ఉంది. ఆ కారు సోమవారం మధ్యాహ్నం 3.19 గంటలకు పార్కింగ్‌లోకి వచ్చింది. సాయంత్రం 6.48 గంటలకు పార్కింగ్ ప్రాంతం నుండి బయలుదేరింది. అది బయలుదేరిన కొద్దిసేపటికి పేలుడు సంభవించింది.
కారు ఓనర్.. జమ్మూలోని పుల్వామా వాసి
పేలుడులో ఉపయోగించిన కారు గురుగ్రామ్ RTO వద్ద రిజిస్టర్ అయ్యింది. కారు రిజిస్ట్రేషన్ నంబర్ HR 26 CE 7674 ఉంది. మొహమ్మద్ సల్మాన్ పేరుతో వాహనాన్ని రిజిస్టర్ చేశారు అధికారులు. మొహమ్మద్ సల్మాన్‌ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలాఉండగా సల్మాన్ ఇప్పటికే ఆ కారుని అమ్మేశాడని దర్యాప్తులో తేలింది.
జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతానికి చెందిన తారిఖ్ ఐ 20 కారుని కొనుగోలు చేశాడు. తారిక్ అనే వ్యక్తి పేరుపై కారు రిజిస్ట్రేషన్ చేసినట్టు ఉంది. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. పేలుడు సంభవించిన ప్రాంతంలో గుంతలు ఏర్పడలేదు. అలాగని అక్కడ RDX వాడిన ఛాయలు కనిపించలేదు. ఘటన జరిగిన ప్రాంతాన్ని టార్చిలైట్లతో FSL, భద్రతా సిబ్బంది అణువణువుగా పరిశీలించారు.
ALSO READ: ఢిల్లీ పేలుడులో భయానక దృశ్యాలు.. ముక్కలై కారుపై పడిన మృతదేహం
ఢిల్లీ పోలీసు వర్గాల సమాచారం ప్రకారం.. నిందితుడి కారు పార్కింగ్ చేసి బయటకు వస్తున్నట్లు చూపించే CCTV ఫుటేజ్‌లను గుర్తించారు అధికారులు. ఆ సమయంలో నిందితుడు ఒంటరిగా ఉన్నాడని తెలుస్తోంది. దర్యాప్తు అధికారులు దర్యాగంజ్ వైపు దృష్టి సారించారు. సమీపంలోని టోల్ ప్లాజాల వద్ద ఫుటేజ్‌లతో సహా వాహనం కదలికను క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.
ఢిల్లీ పేలుడు ఘటనపై విశ్వసనీయ వర్గాల సమాచారం
పేలుడు జరిగిన కారు రిజిస్ట్రేషన్ నెం. HR26CE7674
జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా నివాసి తారిక్ అనే వ్యక్తి పేరుపై కారు రిజిస్ట్రేషన్
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం పేలుడు సంభవించిన ప్రాంతంలో గుంతలు ఏర్పడలేదు
RDX వాడిన ఛాయలు లభించలేదు pic.twitter.com/yawEGgosCw
— BIG TV Breaking News (@bigtvtelugu) November 11, 2025