rithika nayak (1)
Ritika Nayak Latest Photos: రితిక నాయక్.. ప్రస్తుతం ఈ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగుతుంది. సూపర్ హీరో తేజ సజ్జ హీరోగా నటించిన లేటెస్ట్ మిరాయ్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. దీంతో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.
rithika nayak (2)
ఇందులో ఆమె అందం, అభినయంకు కుర్రకారు ఫిదా అయ్యింది. నిజానిక ఇందులో ఆమె ఓ సన్యాసినిగా కనిపించింది. సింపుల్ లుక్ తో రితిక ఆడియన్స్ బాగా ఆకట్టుకుంది. అమాయకమైన చూపులు, చురుకైనా మాటలు, డైలాగ్స్ తో ఆడియన్స్ మెప్పించింది.
rithika nayak (3)
ముఖ్యంగా ఆమె లుక్ కుర్రాళ్ల ను దృష్టిని ఆకర్షించింది. నిజానికి రితిక ఇండస్ట్రీకి ఎప్పుడో ఎంట్రీ ఇచ్చింది. విశ్వక్ సేన్ హీరోగా నటించిన అశోక వనంలో అర్జున కళ్యాణ్ చిత్రంలో ఆమె సెకండ్ హీరోయిన్ గా నటించింది.
rithika nayak (4)
హీరోయిన్ చెల్లెలు అయినప్పటికీ ఆమె పాత్రకే ఎక్కువ స్కోప్ కనిపించింది. నిజం చెప్పాలంటే ఈమె లీడ్ అని చెప్పాలి. ఇందులోనూ సింపుల్ లుక్ లో ఆకట్టుకుంది.
rithika nayak (5)
హీరోయిన్, హీరో కాదని.. ప్రిమించిన వాడిని పెళ్లి చేసుకోవడం, ఆ తర్వాత లాక్ డౌన్ రావడంతో ఆ కుటుంబంలో అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది.
rithika nayak (6)
అదే టైంలో హీరోకి, హీరోయిన్ చెల్లి మధ్య మంచి బాండ్ పెరుగుతుంది. అదే టైంలో హీరోకి ధైర్యం చెబుతూ తనదైన నటన, డైలాగ్స్ తో ఆకట్టుకుంది. ఈ మూవీ మంచి విజయం సాధించినప్పటికీ.. రితికకు మాత్రం పెద్దగా గుర్తింపు రాలేదు.
rithika nayak (7)
కానీ, మిరాయ్ తో ఈమె లైమ్ లైట్లోకి వచ్చింది. ప్రస్తుతం మిరాయ్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న ఈ బ్యూటీ.. సక్సెస్ మీట్స్ లో, ఇంటర్య్వూలో పాల్గొంది. ఈ క్రమంలో ప్రమోషనల్ కార్యక్రమంలో ఈ భామ చీరలో అందంగా ముస్తాబైంది.
rithika nayak (8)
మిరాయ్ విశాఖ పర్యటనలో పాల్గొన్న ఈ భామ చీరలో సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. రితిక గ్లామర్ కి కుర్రకారు ఫిదా అయింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.