Larry Ellison: ప్రపంచంలో అత్యంత ధనమైన వ్యక్తుల్లో రెండో వాడు ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎల్లిసన్.. ఈయన జీవితంలో ఓ అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. ఎల్లిసన్ ఆయన సంపాదించిన మొత్తం ఆస్తిలో 95 శాతం దాన ధర్మాలు చేయాలని గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అతని మొత్తం ఆస్తి విలువ 373 బిలియన్ డాలర్లు. ఒరికాల్ స్టాక్ లలో ఏఐ బూమ్ కారణంగా ఆయన సంపాదన విపరీతంగా పెరిగింది. అలాగే టెస్లాలో అతని ఇన్వెస్ట్ మెంట్ కారణంగా సంపద మరింత వేగంగా పెరిగింది.
2010లో ధానం చేస్తానని ప్రకటన..
2010 వ సంవత్సరంలో గివింగ్ ప్లెడ్జ్ లో భాగంగా ఎల్లిసన్ తన ఆస్తిలో మెజారిటీ శాతం దానం ధర్మాలకు చేస్తానని ప్రకటించారు. అన్నట్టుగానే ఆయన అద్భుతం అయిన నిర్ణయం తీసుకున్నారు. అయితే కొన్ని నిబంధనల ప్రకారం సంపద దానం చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. కొన్ని స్వచ్ఛంధ స్థంసలకు కాకుండా తన ఇష్టానుసారంగా ఆస్తిని పంచాలని ఆయన భావిస్తున్నారు.
ఎల్లిసన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ధాన ధర్మాలు..
ఎల్లిసన్ తన దాతృత్వ కార్యక్రమాలను ప్రధానంగా ఆక్స్ ఫర్డ్ యూనివర్సిలోని ఎల్లిసన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఈఐటీ) ద్వారా నిర్వహిస్తున్నారు. ఈఐటీ ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ, వాతావరణ మార్పులు, ఏఐ పరిశోధన వంటి ప్రపంచ సవాళ్లపై ఫోకస్ పెడుతోంది. 2027 నాటికి ఆక్స్‌ఫర్డ్‌లో 1.3 బిలియన్ డాలర్ల విలువైన కొత్త ఈటి క్యాంపస్ ఓపెన్ చేయనున్నారు. ఎల్లిసన్ యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియాకు క్యాన్సర్ పరిశోధన కేంద్రం కోసం 200 మిలియన్ డాలర్లు, అలాగే ఎల్లిసన్ మెడికల్ ఫౌండేషన్ కు సుమారు 1 బిలియన్ డాలర్లు దానం చేయనున్నారు. ఈ ఫౌండేషన్ వృద్ధుల సంరక్షణ, వ్యాధుల నివారణ పై దృష్టి పెడుతోంది.
ఈ ప్రాజెక్ట్ చాలా సవాళ్లతో కూడుకున్న పని..
ఎల్లిసన్ సాంప్రదాయ దాతృత్వ సంస్థలకు దూరంగా ఉంటూ.. తన సంపదను సొంత నిబంధనలతో ఇష్టానుసారంగా ధాన ధర్మాల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇతర రిచెస్ట్ పర్సన్లతో పోలిస్తే అతని ప్రత్యక్షంగా సంపదను ఖర్చు పెట్టడంతో తక్కువే అయనప్పటికీ.. గివింగ్ ప్లెడ్జ్, ఈఐటీ ద్వారా బిలియన్ డాలర్లు ఖర్చు పెడుతున్నారు. అయితే ఇటీవల ఈఐటీలో వచ్చిన మార్పులు కొన్ని సవాళ్లను తెచ్చిపెట్టాయి. 2024లో జాన్ బెల్‌ను సంస్థ హెడ్ గా నియమించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ‘చాలా సవాలుతో కూడుకున్న పని’ అని పదవి నుంచి వైదొలిగాడు. ఎల్లిసన్ తన సంపదను సమాజ శ్రేయస్సు కోసం, ముఖ్యంగా సాంకేతికత,ఆరోగ్య సంరక్షణ రంగాల్లో ఉపయోగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా ప్రపంచ సమస్యలను పరిష్కరించేందుకు తోడ్పడుతున్నారు.
ALSO READ: Police Constable: 7565 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. భారీ వేతనం, ఇంటర్ పాసైతే చాలు