కొద్ది మంది జీవితాల్లో కొన్ని అద్భుతాలు జరుగుతాయి. అస్సలు ఊహించని ఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. కేరళకు చెందిన ఓ వ్యక్తి విషయంలోనూ అచ్చం ఇలాగే జరిగింది. ఈ ఏడాది కృష్ణాష్టమి నాడు కాయంకుళంకు చెందిన బిజు డేవిడ్ కు కోర్టు నుండి ఊహించని సమన్లు వచ్చాయి. దాదాపు 22 సంవత్సరాల క్రితం అతడి కుటుంబం పోగొట్టుకున్న బంగారు ఆభరణాలు దొరికాయని, వాటిని తీసుకెళ్లాలని ఆ సమన్లలో రాసి ఉంది. ఈ విషయం తెలియంతో బిజు ఆశ్చర్యపోయాడు. 23 గ్రాముల బరువున్న బంగారం ఇప్పుడు రూ. 2.3 లక్షలకు పైగా విలువ చేస్తుంది. అయితే, వాటిని తన కుమార్తె అంజు ఎలిజబెత్ డేవిడ్కు బహుమతిగా ఇవ్వాలనుకున్నాడు. ఎందుకంటే, ఆమె 5 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తన మీది నుంచే ఆ నగలు దొంగిలించబడ్డాయి.
ఆగస్టు 3, 2003 తెల్లవారుజామున, ఒక దొంగ బిజు ఐదు నెలల కుమార్తె నుంచి గాజులు, పట్టీలు, నడుము గొలుసును దొంగిలించాడు. బిజు దొంగతనం గమనించి అతని చేతులు లాక్కోవడానికి ప్రయత్నించాడు, కానీ ఆ దొంగ వారికి దొరక్కుండా పారిపోయాడు. మరుసటి రోజు అతడు కాయంకుళం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కానీ, పోలీసులు ఆ కేసు విషయంలో ఎలాంటి పురోగతి సాధించలేదు. కొన్ని నెలల తర్వాత, అంబలపుళ పోలీసులు అనేక నేరాలకు పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు. విచారణలో, అతను కాయంకుళం కేసుతో సహా అనేక దొంగతనాలకు పాల్పడ్డాడని ఒప్పుకున్నాడు. “పక్కి సుబైర్ అనే దొంగను తాము పట్టుకున్నామని పోలీసు అధికారి నాకు చెప్పారు. సెంట్రల్ జైలు నుంచి తిరిగి వస్తున్నప్పుడు సుబైర్ ఈ నేరం చేశాడని వెల్లడించాడు” అని కొట్టాయం CMS కళాశాలలో సీనియర్ క్లర్క్ అయిన బిజు గుర్తుచేసుకున్నాడు. సుబైర్ ఇప్పటికే ఆభరణాలను అమ్మేశాడని వెల్లడించాడు. పోలీసులు కొనుగోలుదారుని గుర్తించి, బంగారాన్ని స్వాధీనం చేసుకుని, కాయంకుళం కోర్టుకు సమర్పించారు.
ఆ తర్వాత బిజు ఆ ఆభరణాల గురించి పట్టించుకోలేదు. అవి పోయాయని వదిలేశాడు. మూడు సంవత్సరాల క్రితం, అతడు ఈ కేసు గురించి విచారించాడు. నిందితుడు చాలాసార్లు కస్టడీ నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించడంతో సుబైర్ స్టేటస్ లాంగ్ పెండింగ్ లో ఉందని తెలుసుకున్నాడు. రెండు నెలల క్రితం, బిజు, అతడి భార్య అనుమోల్ వాంగ్మూలాలను ఇవ్వడానికి కోర్టుకు పిలిచారు. సుమారు 2 దశాబ్దాల తర్వాత వచ్చిన సమన్లు పోయిన బంగారం మీద కొత్త ఆశను తెచ్చిపెట్టాయి. “వ్యవస్థను నమ్మడానికి ఇది ఒక ప్రధాన ఉదాహరణ. చివరకు మేము బంగారాన్ని తిరిగి పొందినందుకు నేను సంతోషంగా ఉన్నాను” అని బిజు అన్నాడు. అంజుకు ఇప్పుడు 22 సంవత్సరాలని, చిత్తూరులోని అపోలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్‌లో మూడవ సంవత్సరం BSc నర్సింగ్ చదువుతుందన్నాడు. బంగారం దొరికిందని తెలుసుకుని ఆమె తనకు ఫోన్ చేసి, వాటిన దాచిపెట్టాలని చెప్పినట్లు బిజు వెల్లడించాడు.