నారా లోకేష్ కి బీజేపీ అధిష్టానం కాస్త గట్టిగానే ప్రయారిటీ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మధ్య ఏపీ మీటింగ్ లకు వచ్చినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోదీ, లోకేష్ కి బాగానే ఎలివేషన్ ఇస్తున్నారు. ఢిల్లీ వెళ్లినా ఆయనకు మంచి ప్రయారిటీనే ఉంటోంది. అమిత్ షా కొడుకు, జైషాతో కూడా లోకేష్ కి స్నేహం బాగానే కుదిరింది. తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ చాంబర్ ఆఫ్ కామర్స్ తో లోకేష్ మీటింగ్ పెట్టారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల కలిగే ఉపయోగాలను వారికి వివరించారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా పాట్నాలో బీహార్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ ప్రతినిధులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులతో సమావేశమయ్యాను. రాష్ట్రాలు బలోపేతమైతేనే దేశం అభివృద్ధి సాధిస్తుంది. దేశప్రజలు ప్రధానిగా సరైన సమయంలో సరైన నేతను ఎన్నుకున్నారు. దీంతో గత పదేళ్లుగా భారతదేశం అనూహ్యంగా… pic.twitter.com/dIHUiPtJUz
— Lokesh Nara (@naralokesh) November 8, 2025
ఎన్డీఏ వల్లే బీహార్ అభివృద్ధి..
రాష్ట్రాలు బలోపేతమైతేనే దేశాభివృద్ధి సాధ్యం అని చెప్పారు లోకేష్. ప్రభుత్వాల కొనసాగింపుతోనే రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కార్ వల్లే ఎపికి భారీ పెట్టుబడులు వచ్చాయని, అవినీతిరహిత, కమిట్ మెంట్ లీడర్ షిప్ వల్లే బీహార్ అభివృద్ధి చెందుతోందని, బీహార్ పారిశ్రామికవేత్తలు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశాల్లో వివరించారాయన.
The opposition in Bihar believes in dependency. They say: one house, one government job.
We in the NDA believe in empowerment. We say: one house, one entrepreneur. https://t.co/5DF1FQBEvA— Lokesh Nara (@naralokesh) November 8, 2025
మోదీకి ఎలివేషన్..
దేశప్రజలు సరైన సమయంలో సరైన నేతను ప్రధాన మంత్రిగా ఎన్నుకున్నారని మోదీకి ఎలివేషన్ ఇచ్చారు లోకేష్. ఆయన నాయకత్వంలో గత పదేళ్లుగా భారతదేశం అనూహ్యంగా అభివృద్ధి చెందిందని చెప్పారు. అదేవిధంగా బీహార్ ని సీఎం నితీష్ కుమార్ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. నితీష్ కి ముందు, నితీష్ తర్వాత అన్నట్టుగా అభివృద్ధి జరుగుతోందన్నారు. సమర్థవంతమైన నాయకుడివల్లే బీహార్ అభివృద్ధి సాధిస్తోందని వివరించారు. లీడర్ షిప్ ట్రాక్ రికార్డుతోపాటు శాంతిభద్రతలు, మహిళల భద్రత, అవినీతి రహిత పాలనే ఇందుకు కారణం అన్నారు లోకేష్.
కేంద్రంతో సత్సంబంధాలు..
కేంద్ర, రాష్ట్ర సత్సంబంధాల విషయంలో ఆంధ్ర ప్రదేశ్, బీహార్ మధ్య చాాల పోలికలు ఉన్నాయని చెప్పారు లోకేష్. డబుల్ ఇంజన్ బుల్లెట్ సర్కారు కారణంగా ఏపీ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు లోకేష్. చిన్న రాష్ట్రమైనా ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయంటే దానికి కారణం సీఎంగా చంద్రబాబు, ప్రధానిగా మోదీ ఉండటమేనని చెప్పారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పాజిటివ్ లీడర్ షిప్, పన్ను విధానంలో మార్పుల కారణంగా కేవలం 12నెలల్లో ఏపీకి గూగుల్ సంస్థను రప్పించగలిగామని వివరించారు. దేశంలోనే అతిపెద్ద ఉక్కుపరిశ్రమను ఆర్సెలర్స్ మిట్టల్ ఏపీలో ఏర్పాటు చేయబోతోందన్నారు.
ఏపీలో లాగే బీహార్ లో కూడా సమర్థ నాయకత్వం ఉందని, ఆ నాయకత్వాన్ని కొనసాగించాలన్నారు లోకేష్. బీహార్ లో తాను మొదటిసారి పర్యటిస్తున్నానని, ఏపీ మంత్రిగా తాను బీహార్ కు రాలేదని భారతీయుడిగా వచ్చానని అన్నారు. బీహార్ లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని గెలిపించాలని ఇక్కడి ప్రజలను కోరేందుకు వచ్చానన్నారు. ఏపీలో అభివృద్ధి కోసం ఎన్డీఏ కూటమిని ప్రజలు 94శాతం స్ట్రైక్ రేట్ తో గెలిపించారని గుర్తు చేశారు. బీహార్ లో కూడా ఇదే విధమైన ఫలితాలు పునరావృతం కావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఏపీలో వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్ ప్రెన్యూర్ లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని అన్న లోకేష్.. ఇక్కడ ప్రతిపక్షం ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అని చేస్తున్న ప్రచారం వర్కవుట్ కాదని అన్నారు. బీహార్ ప్రజలు ఎన్డీఏని గెలిపించాలని కోరారు.
Also Read: మాకేమైనా బిచ్చమేస్తున్నారా? అధికారులపై టీడీపీ ఎమ్మెల్యే ఆగ్రహం