Ritu Varma Latest Photos: టాలీవుడ్‌లో ఉన్న తెలుగమ్మాయిల్లో రీతూ వర్మ ఒకరు. వెంటవెంటనే సినిమాల్లో నటించకపోయినా.. అప్పుడప్పుడు అయినా గుర్తుండిపోయే పాత్రల్లో కనిపించింది తెలుగమ్మాయి.
ప్రస్తుతం శ్రీ విష్ణు హీరోగా నటించిన ‘స్వాగ్’లో హీరోయిన్‌గా నటించిన రీతూ.. ఈ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా గడిపేస్తోంది.
ప్రమోషన్స్‌కు వెళ్లడం, ట్రెడీషినర్ వేర్‌లో రెడీ అయ్యి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం రీతూ వర్మకు అలవాటుగా మారింది.
హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కిన ‘స్వాగ్’లో అనుభూతి అనే పాత్రలో కనిపించింది రీతూ వర్మ.
షార్ట్ ఫిల్మ్స్‌లో హీరోయిన్‌గా నటిస్తూ.. ‘బాద్’షా’ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పరిచయమయ్యింది రీతూ.
‘ప్రేమ ఇష్క్ కాదల్’తో పూర్తిస్థాయి హీరోయిన్‌గా మారి ‘పెళ్లిచూపులు’తోనే తనకు నటిగా మంచి గుర్తింపు లభించింది.
తెలుగులో మాత్రమే కాదు తమిళంలో కూడా హీరోయిన్‌గా అడుగుపెట్టింది రీతూ. అక్కడ తన మొదటి సినిమా ‘కన్నుమ్ కన్నుమ్ కొల్లైయాడితల్’తో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది.
ఇక రీతూ వర్మ నటించిన ‘స్వాగ్’ మూవీ అక్టోబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమయ్యింది.