RSAW vs PAKW: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ ( ICC Womens World Cup 2025 ) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ లో పాకిస్తాన్ అత్యంత చెత్త ప్రదర్శన కనబరిచింది. ఇప్పటి వరకు ఆడిన అన్ని మ్యాచ్ ల్లో కూడా పాకిస్తాన్ ఓడిపోయింది. ఈ నేపథ్యంలోనే మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ నుంచి ఎలిమినేట్ అయి, ఇంటిదారి పట్టింది పాకిస్తాన్. దక్షిణాఫ్రికాపై ఇవాళ కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో పాకిస్తాన్ అత్యంత దారుణంగా 150 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి దెబ్బకు ఎలిమినేట్ అయింది పాకిస్తాన్. అంటే ఇప్పటికే సౌత్ ఆఫ్రికా సెమీస్ కు క్వాలిఫై అయిన సంగతి తెలిసిందే.
Also Read: Sara Tendulkar: 28 ఏళ్ల సారా ఇంత అందంగా ఉండటం వెనుక సీక్రెట్ ఇదే.. రాత్రి అయితే అవే పనులు ?
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ దక్షిణాఫ్రికా వర్సెస్ పాకిస్తాన్ ( South Africa Women vs Pakistan Women) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ శ్రీలంకలోని కొలంబో వేదికగా నిర్వహించారు. ఇప్పటి వరకు ఈ వేదికగా జరిగిన నాలుగు మ్యాచ్ లు కూడా వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఇవాళ జరిగిన మ్యాచ్ కు కూడా వర్షం విలన్ గా మారింది. పదే పదే వర్షం పడడంతో DLS ప్రకారం ఓవర్లను కుదించారు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ చేస్తున్న నేపథ్యంలో 40 ఓవర్లకు మ్యాచ్ కుదించారు.
ఈ నేపథ్యంలోనే 9 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా 312 పరుగులు చేసింది. ఇక ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ దారుణంగా విఫలమైంది. పాకిస్తాన్ కూడా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మళ్లీ వర్షం పడడంతో ఓవర్లను మరోసారి పూజించారు. డక్వర్తు లూయిస్ పద్ధతి ప్రకారం 20 ఓవర్లకు ఫిక్స్ చేశారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ముందు కొండంత టార్గెట్ వచ్చి పడింది. దీంతో ఒత్తిడికి లోనైన పాకిస్తాన్ దారుణంగా ఓడిపోయింది. 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి, 83 పరుగులు చేసింది పాకిస్థాన్. ఈ ఓటమితో టోర్నమెంట్ నుంచి వైదొలగాల్సి వచ్చింది.
వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా సెమీ ఫైనల్ కు వెళుతుందా ? లేదా ? అనే టెన్షన్ అందరిలోనూ ఉంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు కేవలం రెండు మ్యాచ్ లలోనే విజయం సాధించిన ఇండియా, గ్రూప్ స్టేజిలో మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. న్యూజిలాండ్ అలాగే బంగ్లాదేశ్ పైన కచ్చితంగా టీమిండియా గెలవాలి. అలా కాదని న్యూజిలాండ్ చేతిలో ఓడిపోతే బంగ్లాదేశ్ పైన కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇంగ్లాండ్ చేతిలో న్యూజిలాండ్ ఓడిపోతేనే టీం ఇండియా సెమీస్కు దూసుకు వెళ్తుంది. కాబట్టి తర్వాత ఆడే రెండు మ్యాచ్ లు టీమిండియా కు చాలా కీలకము.