Emmanuel : బిగ్ బాస్ సీజన్ 9 లో చాలామందికి ఫేవరెట్ కంటెస్టెంట్ ఇమ్మానుయేల్. అయితే ఇప్పుడిప్పుడే ఇమ్మానుయేల్ అసలు రంగు కూడా బయటపడుతుంది. ముఖ్యంగా భరణి ఎలిమినేషన్ లో ఉంటే తనని సేవ్ చేయకుండా రాము రాథోడ్ ను సేవ్ చేయటం వలన కొంత నెగిటివిటీ ఇమ్మానుయేల్ మీదికి వచ్చింది. అది ఇమ్మానుయేల్ గేమ్ ప్లాన్ అయినా కూడా ముందు నుంచి భరణితో క్లోజ్ గా ఉండి అలా చేయడం అనేది చాలామందికి జీర్ణించుకోలేని విషయం.
అంతేకాకుండా రాము రాథోడ్ తన తప్పుల్ని పెద్దగా ఒప్పుకోడు తనది ఏదైనా రాంగ్ ఉంటే ఈజీగా దాటేస్తాడు అని రీతు చౌదరితో సంభాషణ కూడా జరిపాడు ఇమ్మానియేల్. ఇంత జరిగిన తర్వాత కూడా రాము రాథోడ్ ను సేవ్ చేసి భరణిని బయటకు పంపాడు అంటే భరణిని ఇమ్మానుయేల్ ఒక స్టఫ్ కాంపిటీషన్ అని ఫీల్ అయి ఉంటాడు అనేది వాస్తవం.
మాధురికి ఇమ్మాన్యుయేల్ వెన్నుపోటు పోడిచేలా ఉన్నాడు. ఈ రోజు టాస్క్ లో మాధురి, సంజన టీం రెండుగా డివైడ్ అయ్యింది. ఏ టీంలో ఎక్కువ మంది సభ్యులు ఉండి. డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే ఆ టీం గెలిచినట్టు. ఆట మధ్యలో మిగతా వాళ్లు వాళ్ల ఇష్ట ప్రకారం టీం మారోచ్చు.
అయితే గేమ్ మొదలయ్యాక.. ఇమ్మాన్యుయేల్ సంజన దగ్గరికి వెళ్లి ఇప్పుడంత మాధురి టీంలో ఉన్నా.. చివరికి చూడు ఒక్కొక్కరు ఇటే వస్తారు అన్నాడు. కానీ, ఇమ్మూ మాధురి టీంలో ఉన్నాడు. ఫస్ట్ రౌండ్ మాధురి టీం గెలిచింది. ఇలా చివరి వరకు మాధురితో ఉండి.. లాస్ట్ మూమెంట్ లో సంజన టీంకి వెళ్లేలా ఉన్నాడు.
అంతేకాదు మిగతా వారిని కూడా ఇన్ప్లూయేన్స్ చేసి సంజన టీంకి తీసుకువెళ్లే ప్లాన్ చేశాడు అనిపిస్తుంది. ఇలా చేస్తే మాధురికి షాకే కదా. మాధురితోనే ఉండే వెన్నుపోటు పోడిచే ప్లాన్ ఇమ్మూ చేస్తున్నాడు అని ఈజీగా అర్థమయిపోతుంది.
ఇమ్మానుయేల్ ని అంత తక్కువ అంచనా వేయకూడదు. మెల్లమెల్లిగా ఇమ్మానియేల్ ఒరిజినాలిటీ కూడా బయటపడుతుంది. ఒకటి భరణిను ఎలిమినేట్ చేయడంలో కీలకపాత్ర వహించటం. అలానే అతనికి ఐదు నామినేషన్ టికెట్లు దొరికినా కూడా ఒకటి కూడా ఉంచకుండా పంచడం అనేది ఇంకొక రీజన్.
ఇమ్మానుయేల్ నామినేషన్ వాడుకొని ఎవరినైనా నామినేషన్ చేస్తే వాళ్లు మళ్లీ తిరిగి ఇమ్మానుయేల్ను టార్గెట్ చేసే అవకాశం ఉంది కాబట్టి చాలా తెలివిగా తనకు వచ్చిన ఐదు టికెట్లు కూడా పంచేశాడు.
Also Read : Bigg Boss Ayesha: శివంగిలా రెచ్చిపోయిన ఆయేషా సైలెంట్ , అసలు కారణమేంటంటే?