E-Paper
Advertisement

OTT Movie : హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి అరాచకం… ఆ సీన్లే హైలెట్ భయ్యా… దిమాక్ కరాబ్ క్లైమాక్స్

OTT Movie : హిందూ అమ్మాయి ముస్లిం అబ్బాయి అరాచకం… ఆ సీన్లే హైలెట్ భయ్యా… దిమాక్ కరాబ్ క్లైమాక్స్
Advertisement

OTT Movie : బెంగాలీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఒక రొమాంటిక్ సినిమా, ఆడియన్స్ ని ఆలోచనల్లో పడేస్తోంది. ఈ కథ ఇది ఒక హిందూ అమ్మాయి, ముస్లిం అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. వీళ్ళు టీనేజ్ లో ఉండగానే ప్రేమలో పడి లేచి పోతారు. ఆ తరువాత స్టోరీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. సిటీలో వీళ్ళు ఎదుర్కునే సంఘటనలు ఆసక్తికరంగా ఉంటాయి. ప్రేమికులు మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. దీని పేరు ? ఏ ఓటీటీలో ఉంది ? దీని కథ ఏమిటి ? అనే వివరాలను, తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘మోన్ పోటోంగో’ (Mon potongo) 2024లో వచ్చిన బెంగాలీ రొమాంటిక్ మూవీ. రాజ్‌దీప్ పాల్ దీనికి దర్శకత్వం వహించారు. సుభాంకర్ మొహంత, బైషాఖీ రాయ్, సీమా బిస్వాస్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 డిసెంబర్ 13న విడుదల అయింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్‌ అవుతోంది. దాదాపు రెండు గంటల ముప్పై నిమిషాలు ఉన్న ఈ సినిమా, IMDbలో 6.8/10 రేటింగ్ పొందింది.

కథలోకి వెళ్తే

Advertisement

ఒక చిన్న గ్రామంలో అహ్మద్ అనే ముస్లిం అబ్బాయి, లీలా అనే హిందూ అమ్మాయి ప్రేమలో పడతారు. వాళ్ల గ్రామంలో మతం, కులం వల్ల గొడవలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళ మతాలు వేరు కావడంతో అదే ఊరిలో ఉండటానికి భయపడతారు. అక్కడి నుంచి తప్పించుకుని అహ్మద్, లీలా కలకత్తాకు పారిపోతారు. కలకత్తాలో వాళ్లు ఒంటరిగా జీవిస్తూ, చిన్న చిన్న పనులు చేస్తారు. వాళ్లకు డబ్బు, మంచి జీవితం కావాలని కలలు కంటారు. ఒక రోజు, ఒక షోరూమ్‌లో అందమైన కుర్చీని చూస్తారు. ఆ కుర్చీ వాళ్లకు రాజు, రాణిలాగా జీవించాలనే ఊహాని ఇస్తుంది. వాళ్లు ఆ కుర్చీపై కూర్చోవాలని, సంపదవంతులు కావాలని కలలు కూడా కంటారు. ఇక కలకత్తాలో అహ్మద్ , లీలా డబ్బు సంపాదించడానికి కష్టపడతారు. డబ్బు కోసం వాళ్లు చిన్న చిన్న మోసాలు, చెడు పనులు చేయడం మొదలెడతారు.

Read Also : క్రిమినల్ ను పట్టుకోవడానికెళ్లి తప్పించుకోలేని ట్రాప్ లో… చిన్న పిల్లలు చూడకూడని సై-ఫై మూవీ

Advertisement

ఈ క్రమంలో వాళ్ల మధ్య ప్రేమ బలంగా ఉన్నా, చిన్న చిన్న సమస్యలు వాళ్లను ఇబ్బంది పెడతాయి. ఒక రోజు అహ్మద్, మీరా ఆ లగ్జరీ ఆర్మ్‌చైర్ కొనడానికి, సొసైటీలో సక్సెస్ అవ్వడానికి ఒక బిగ్ ప్లాన్ చేస్తారు. అహ్మద్ ఒక క్రిమినల్ గ్యాంగ్‌తో ఒక పెద్ద క్రైమ్ కు ప్లాన్ చేస్తాడు. కానీ ఈ డీల్ సమయంలో ఊహించని ట్విస్ట్లు వస్తాయి. అహ్మద్ ఆ గ్యాంగ్ చేతిలో బాగా గాయపడతాడు. మీరా అతన్ని హాస్పిటల్‌కు తీసుకెళ్తుంది. వాళ్లు ఆర్మ్‌చైర్ కొనడానికి డబ్బు సంపాదిస్తారు. కానీ అహ్మద్ చెడు మార్గం వల్ల వాళ్ల ప్రేమ రిస్క్ లో పడుతుంది. చివరికి వీళ్ళ ప్రేమ ఏమవుతుంది ? ఆ కుర్చీని వీళ్ళు కొంటారా ? వీళ్ళ ప్రేమ బ్రేక్ అవుతుందా ? అనే విషయాల ఈ సినిమాని చూసి తెలుసుకోండి.

Related News

Friday OTT Releases : శుక్రవారం ఓటీటీలోకి రాబోతున్న సినిమాలు.. ఏకంగా 14 స్ట్రీమింగ్…!

అడగకుండా సినిమా తీశారని హత్యలు… హారర్ క్లాసిక్స్ కి నవ్వుల ట్రీట్… ఓటీటీని షేక్ చేస్తున్న ఐకానిక్ పారడీ ఫిల్మ్

అధ్యక్షుడి కేక్ వెనుక దాగిన భయంకరమైన కుట్ర… ఆస్కార్ రేసులో నిలిచిన డార్క్ పొలిటికల్ కామెడీ డ్రామా

మన చుట్టూ జరిగే భయంకరమైన దారుణాలు… గజగజ వణికించే రియల్ లైఫ్ క్రైమ్ ఆంథాలజీ

కెరీర్ కాపాడుకోవడానికి ఫుట్‌బాల్ స్టార్ చేసిన పిచ్చి పని… ఓటీటీలో రచ్చ చేస్తున్న గ్లెన్ పావెల్ ఐకానిక్ కామెడీ స్పోర్ట్స్ డ్రామా

బిలియనీర్ల ప్రపంచంలో బుర్రపాడు పనులు… పార్ట్-1 సీట్ ఎడ్జ్ హిట్ తర్వాత వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెల్

కిడ్నాపైన కూతురి కోసం అండర్‌వరల్డ్‌ను అల్లాడించిన తల్లి… నెట్‌ఫ్లిక్స్‌ని షేక్ చేస్తున్న సీట్-ఎడ్జ్ రివేంజ్ డ్రామా తెలుగులో

మ్యూజిక్‌తో ప్రపంచాన్ని ఏలిన పాప్ లెజెండ్ రియల్ స్టోరీ… కళ్లు చెమర్చేలా చేసే మ్యూజికల్ డాక్యుమెంటరీ

Big Stories

Advertisement
×