Deepika Padukone Daughter Dua: దీపిక పదుకొనె ఈ మధ్య తరచూ వివాదాలు, విమర్శలతో వార్తల్లో నిలుస్తోంది. దీపికాకు నెగిటివిటీతో ఫ్యాన్స్ అంత ఆందోళనలో ఉన్నారు. కానీ, దీపికా మాత్రం తనపై ఎంత నెగిటివిటీ వస్తున్న కొంచం కూడా ఆత్మస్థైర్యాన్ని కొల్పోలేదు. ఆమె పని ఆమె చేసుకుంటుపోతుంది. ఇదిలా ఉంటే దీపావళి పండుగ సందర్భంగా దీపికా ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. తన ముద్దుల తనయ దువాను (Deepika Daughter Dua) పరిచయం చేసింది. పండుగ పర్వదినాన.. కూతురి ఫేస్ రివీల్ చేసి ఫ్యాన్స్ డబుల్ ట్రీట్ ఇచ్చింది.
కాసేపటి క్రితం కూతురితో దిగిన ఫోటోలను షేర్ చేసింది. దీపికా, రణ్ వీర్ లు తమ ముద్దుల కూతుర దువాతో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. దీపావళి సందర్భంగా తీసుకున్న ఈ స్పెషల్ ఫోటోలను షేర్ చేసింది. వీటిని షేర్ చేస్తూ దీపావళి శుభాకాంక్షలు తెలిపింది. ఇందులో దువాను చూసి అంత సర్ప్రైజ్ అవుతున్నారు. ఎంత క్యూట్ ఉంది.. అచ్చం దీపికాల ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే హన్సిక, పూజ హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్ లు సైతం దీపికా పోస్ట్ కి స్పందించారు. సో క్యూట్ అంటూ హన్సిక కామెంట్ చేయగా.. రకుత్ ఆ దేవుడి ఆశీర్వాదాలు మీకు ఎల్లప్పుడు ఉండాలి అంటూ స్పందించింది. ప్రస్తుతం దీపికా కూతురు దువా ఫోటోలు నెట్టింట స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి.
ఏడాది తర్వాత కూతురి ఫోటోని రివీల్ చేయడంతో నెటిజన్స్ అంత దువా గురించి చర్చించుకుంటున్నారు. అంతేకాదు దువా ఫోటోలను రీ షేర్ చేస్తూ దీపికా కాపీ క్యాట్ అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. కాగా దీపికా పదుకొనె, రణవీర్ లకు పెళ్లయిన ఎనిమిదేళ్లకు దువా జన్మచ్చింది. గతేడాది 2024 సెప్టెంబర్ 8న దువా పుట్టిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూతురి చూపించకుండ ఈ జంట జాగ్రత్త పడింది. కనీసం బయటకు కూడా ఎక్కువగా తీసుకురాలేదు.
Also Read: Sobhita: బొట్టు ఎక్కడ? ఇది దీపావళా.. రంజానా.. దీపికా డ్రెస్సింగ్ పై ట్రోల్స్
కూతురి కోసం కొన్ని నెలల పాటు షూటింగ్ కి కూడా బ్రేక్ ఇచ్చింది. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు దువాను మీడియా ముందుకు తీసుకురాలే రణవీర్, దీపికాలు. ఎక్కడికి వెళ్లిన కూతురిని ఇంట్లోని ఉంచి వీరు మాత్రమే బయటకు వచ్చేవారు. దువా కోసం కొంతకాలం దీపికా కూడా మీడియాకు మొహం చాటేసింది. ఇంట్లోని ఉంటూ దువాను చూసుకుంది. ఇప్పుడు కూతురి కోసం పని గంటల విషయంలో ఆంక్షలు పెడుతుంది. దీంతో ఈ దీపికా ఇండస్ట్రీలో కాంట్రావర్సల్ అవుతోంది. ఎట్టకేలకు అనుష్క, విరాట్ కోహ్లిలా కాకుండా.. కూతురు పుట్టిన ఏడాదికైనా ఆమెను చూపించారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఎట్టకేలకు దువాను చూపించడంతో ఫ్యాన్స్ మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు.