Bigg Boss Ayesha: బిగ్ బాస్ సీజన్ 9 చాలా ఆసక్తికరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫైర్ స్ట్రోమ్ లో భాగంగా వైల్డ్ కార్డు ఎంట్రీస్ వచ్చిన తర్వాత షో ఇంకొంచెం ఆసక్తిగా మారింది. వైల్డ్ కార్డు ఎంట్రీస్ తో నలుగురు సెలబ్రిటీలు ఇద్దరు కామన్ పీపుల్ వచ్చారు. ఆ ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో బాగా పాపులర్ కాబట్టి వాళ్లని తీసుకొచ్చారు. వారిద్దరి మీద సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ కూడా నడిచింది.
ఫైర్ స్ట్రోమ్ అని చెప్పినట్టు హౌస్ లోకి రాగానే దువ్వాడ మాధురి శ్రీజ తో గొడవ పెట్టుకుంది. అలానే రమ్య మోక్ష కూడా విపరీతంగా హౌస్మెట్స్ మీద కామెంట్ చేయడం మొదలుపెట్టింది. తనుజా ను నామినేటి చేస్తూ ఆయేషా మాట్లాడిన పాయింట్స్ కూడా తీవ్రంగా వైరల్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ఆయేషా పెద్దగా కనిపించడం లేదు.
ఎప్పుడూ గలగల మాట్లాడే ఆయేషా కి ఏం జరిగింది అని సందేహం చాలా మందికి వచ్చే ఉంటుంది. అసలు ఏం జరిగిందంటే. ఆయేషా కి హెల్త్ బాలేదు. ఆమె టాస్క్ ఆడట్లేదు. మొన్నటి వరకు శివంగిలా రెచ్చిపోయిన ఆయేషా ఈ రోజు కనిపించలేదు. ఆమె అస్వస్థతకు గురైంది. అందుకే టాస్క్ నుంచి బిగ్ బాస్ ఎక్సెప్షన్ ఇచ్చాడు.
హౌజ్ లో చాలా యాక్టివ్ ఉండేది. ఎక్కడైనా నేనే అన్నట్టు ఉండేది. అందరికి దగ్గరి వెళ్లి గొడవలు. మాధురి తర్వాత హౌజ్ లో ఎక్కడ చూసిన ఆయేషానే కనిపించేది. కానీ, ఆమె సైలెంట్ తో ఆయేషా లేని లోటు కనిపిస్తుంది.
ఈ రోజు టాస్క్ అంత కూల్ గా సాగింది అదే ఆయేషా ఉంటే ఏదోక పుల్ల పెట్టి కంటెంట్ ఇవ్వడానికి చూసేది అని ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది.
నిన్న నామినేషన్ ప్రక్రియలో ఆయేషా మాట్లాడిన విధానం మంచి కంటెంట్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా రీతు చౌదరి మీద రెచ్చిపోయిన తీరు ఎప్పటికీ మర్చిపోలేము. తనలోని మైనస్ పాయింట్స్ దివ్య చెబుతున్నప్పుడు అన్ని యాక్సెప్ట్ చేసింది. కానీ రీతు చెబుతున్నప్పుడు మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఫైర్ అయింది. ఈరోజు టాస్కులు అయోష లేకపోవడం ఆ ఫైర్ కాస్త మిస్ అయింది.
Also Read: The Raja saab : ప్రభాస్ బర్త్ డే కి ఫస్ట్ సింగిల్ లేదు, ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే