OTT Movie : ఓటీటీలో ఎంటర్టైన్మెంట్ కి ఒక వేదికగా మారిపోయింది. థియేటర్లకు కూడా వెల్లకుండానే, ఇంట్లోనే ఒక్క క్లిక్ తో హాయిగా సేద తీరుతున్నారు. కంటెంట్ నచ్చితే భాషని కూడా చూడటం లేదు. కొరియెన్ సినిమాలకు ఇప్పుడు మనవాళ్ళు ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. ఈ మధ్య ‘స్క్విడ్ గేమ్’ లాంటి సిరీస్ లు ట్రెండింగ్ అవుతున్నాయి. ఇలాంటి గేమ్ ఆధారంగా వచ్చిన స్టోరీలు, ఇది వరకే చాలా వచ్చాయి. అయితే కొన్ని మాత్రమే ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ కూడా ఒక గేమ్ ఆధారంగా తెరకెక్కింది. ఇందులో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు ఉంటాయి. గేమ్ ముందుకు వెళ్ళే కొద్ది సీట్ ఎడ్జ్ కి వెళ్ళడం ఖాయం. ఈ సిరీస్ పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘లయర్ గేమ్’ (Liar Game) అనే కొరియన్ థ్రిల్లర్ సిరీస్ కి కిమ్ హాంగ్-సన్ దర్శకత్వం వహించారు. : కిమ్ సో-ఎజ్, లీ సాంగ్-యూన్, షిన్ సుంగ్-రాక్ ప్రధాన పాత్రల్లో నటించారు. 11 ఎపిసోడ్స్ తో ఈ సిరీస్ 2014 అక్టోబర్ 20న Netflix, Viki లో అందుబాటులోకి వచ్చింది. ఇది తెలుగు సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్ అవుతోంది. ఐయండిబి లో 7.4/10 రేటింగ్ ను పొందింది.
దా-జుంగ్ అనే ఒక కాలేజ్ స్టూడెంట్, ఆమె తండ్రి చేసిన అప్పులు వల్ల కష్టాలు పడుతుంటుంది. ఒక రోజు ఆమెకు ఒక మిస్టీరియస్ బాక్స్ వస్తుంది. దానిలో సుమారు 50 లక్షల రూపాయల క్యాష్ తో పాటు, “లైయర్ గేమ్” అనే టీవీ షో ఇన్విటేషన్ కూడా ఉంటుంది. ఈ గేమ్ రూల్స్: ప్లేయర్స్ ఒకరినొకరు మోసం చేసి, డబ్బు గెలవాలి. ఫైనల్ విన్నర్‌కు సుమారు 50 కోట్లు ప్రైజ్ మనీని గెలుచుకొనే అవకాశం ఉంటుంది. దా-జుంగ్ ఈ గేమ్‌లో జాయిన్ అవుతుంది. కానీ ఆమె మంచితనం వల్ల మొదటి రౌండ్‌లోనే మోసపోతుంది. ఆమె ఒప్పోనెంట్ జో డాల్-గూ ఆమె పాత టీచర్, ఆమెను ట్రిక్ చేసి 1 కోటి వొన్ తీసుకుంటాడు. దా-జుంగ్ ఇప్పుడు అప్పులో మునిగిపోతుంది. ఎందుకంటే గేమ్ రూల్స్ ప్రకారం లూజర్స్ డబ్బు తిరిగి చెల్లించాలి.
Read Also : మెడికల్ కాలేజీలో వరుస మరణాలు… అమ్మాయిల టార్గెట్… గుండె జారిపోయే సీన్లు ఉన్న హర్రర్ మూవీ