BigTV English

Bigg Boss 9 Highlghts: ఆయేషా సేఫ్ వెనక పెద్ద కుట్ర.. గౌరవ్ తో మ్యాచ్ ఫిక్సింగ్.. ఇమ్మూ ఇంత కథ నడిపించాడా

Bigg Boss 9 Highlghts: ఆయేషా సేఫ్ వెనక పెద్ద కుట్ర.. గౌరవ్ తో మ్యాచ్ ఫిక్సింగ్.. ఇమ్మూ ఇంత కథ నడిపించాడా
Advertisement


Bigg Boss 9 Day 44 Highlights: నిన్నటి నామినేషన్స్ వార్ కొనసాగుతూనే ఉంది. నామినేషన్ ప్రక్రియ అయిపోయాక కూడా హౌజ్ లో రగడ అలాగే ఉంది. ముఖ్యంగా తనూజ, ఇమ్మానుయేల్ లా మధ్య బిగ్ ఫైట్ అయ్యింది. కళ్యాణ్.. సంజనను నామినేట్ చేయగానే ఇమ్మూ ఎలా లేచాడు. సంజన టైంలో లేని పాయింట్.. కళ్యాణ్ నామినేషన్ లో ఎందుకు వచ్చింది. కళ్యాణ్ నన్ను నామినేట్ చేయలేదని, వాయిస్ రైజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటూ తనూజ దివ్యతో చెప్పుకుంటూ ఫీల్ అయ్యింది. అప్పుడే ఇమ్మాన్యుయేల్ రావడంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి యుద్దమే జరిగింది.

నామినేష చిచ్చు.. పెరిగిన దూరం

మొన్నటి వరకు మంచి స్నేహితులుగా ఉన్న వీరిమధ్య నామినేషన్ చిచ్చు పెట్టిందని, మిత్రులు కాస్తా శత్రువులు అయ్యారు. తనూజ సేఫ్ గేమ్ ఆడుతుందనే పాయింట్ తోనే తనూజను నామినేట్ చేయాలనుకున్నట్టు చెప్పాడు. ఇక నిన్న ఆయేషాను సేఫ్ చేయడం వెనక కూడా ఇమ్మాన్యుయేల్ ప్లానే ఉందట. నామినేషన్ లో సేఫ్ చేసే పవర్ గౌరవ్ రావడం.. ఆ తర్వాత.. ఇమ్మాన్యుయేల్, ఆయేషాలకు స్లిప్స్ రావడంతో ముగ్గురు మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నారట. నామినేషన్స్ తర్వాత మాధురి, దివ్యలు, గౌరవ్ లు కిచెన్ లో మీటింగ్ పెట్టారు. ఆయేషాని సేఫ్ చేయమని ఎవరూ చెప్పారు అని మాధురి అడగడంతో ఇమ్మాన్యుయేల్ చెప్పాడంటూ అసలు విషయం బయటపెట్టాడు.


తమ దగ్గర స్లిప్స్ ఉన్నాయని, సో తనని నామినేట్ చేయమంటూ గౌరవ్ తో ఆయేషా.. ఇమ్మూ డీల్ చేసుకున్నారట. ఇందుకో గౌరవ్ ఆయేషాని లేదా తనని సేఫ్ చేయాలని మ్యాచ్ ఫిక్స్ చేసుకోవడం గౌరవ్ ఆయేషాని సేఫ్ చేశాడు. అటూ కళ్యాణ్ తో ఇమ్మాన్యుయేల్ మోసం చేశావంటూ వాపోయాడు. తనూజని నామినేట్ చేస్తా అనడం వల్లే.. నీకు స్లిప్ ఇచ్చానని, నాకున్న పాయింట్ కంటే నువ్వు చేస్తే ఇంకా స్ట్రాంగ్ ఉంటుందనుకున్నా. ఇంతకాలం సేఫ్ గేమ్ ఆడుతూ వచ్చింది. తన గేమ్ కోసం అందరి ఎమోషన్స్ తో ఆడుకుందని, ఇంతకాలం ఒక కల్ప మొక్కని నీరు పోసి పెంచామంటూ ఇమ్మూ తనూజపై అక్కసు కక్కాడు.

అమ్మో.. నువ్వు మామూలోడివి కాదు..

మరోవైపు ఆయేషా.. గౌరవ్ లు హౌజ్ లో గుసగుస పెట్టుకున్నారు. రమ్య.. తనూజని పర్సనల్ గా టార్గెట్ చేస్తుందని, తను వచ్చినప్పుడే తనూజని బయటకు పంపించాలనే స్ట్రాంగ్ పాయింట్ తో వచ్చిందంటూ ఆయేషా.. గౌరవ్ తో అంటుందిఇటూ కళ్యాణ్ నామినేషన్ పై సంజన రచ్చ చేసింది. తనకి అసలు ఏ పాయింట్స్ లేవని, తనూజని ఇంప్రెస్ చేయడం కోసమే తనని నామినేట్ చేశాడంటుంది. నామినేషన్ హక్కు కోసం ఇమ్మూ దగ్గర తనూజ పేరు చెప్పి డ్రామాలు ఆడావని, తనూజ అఖిల్ తో మాట్లాడుతుంటే… హీరో అవ్వాలని రెండు రోజులు అతడిని టార్గెట్ చేశాడంటూ సంజన నోటికొచ్చినట్టు మాట్లాడింది.

తనూజ నిఖిల్ తో..

తనూజ, నిఖిల్ లు క్లోజ్ అవుతుంటే కళ్యాణ్ ఒంటరైపోతున్నాడనే.. తనూజను నామినేట్ చేయలేదనడంతో.. కళ్యాణ్, మాధురిలు ఆమె మాటలను ఖండించాడు. ఇష్టమొచ్చినట్టు మాట్లాడకండి అంటూ ఆమె మాటలకు చెక్ పెట్టాలని చూసిన సంజన మాత్రం వాదన కొనసాగిస్తూనే ఉంది. ఆ తర్వాత బయటకు వచ్చిన తనూజ.. సంజనపై విరుచుకుపడింది. మీరు ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే ఊరుకోను. ఒక స్టేట్మెంట్ పాస్ చేసేముందు ఒక్కసారి ఆలోచించండి. నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోనంటూ తనూజ డిఫెండ్ చేసుకుంటే కన్నీరు పెట్టుకుంది. బెడ్ రూంలో రీతూతో మాట్లాడుతూ.. పోయిన దాన్ని పోనివ్వకుండ.. త్యాగాలు చేసి మరి రప్పించుకున్నాం చూడు మా బుద్ది తక్కువ అంటూ మండిపడింది తనూజ.

Related News

Bigg Boss 9: హౌజ్ లో కరుడు గట్టిన నేరస్థులు.. ఆనందంలో చిందులేసిన మాస్ మాధురి

Emmanuel : దువ్వాడ మాధురి కే వెన్నుపోటు పొడిచే ప్లాన్, ఇమ్మానియేల్ మామూలోడు కాదు

Bigg Boss Ayesha: శివంగిలా రెచ్చిపోయిన ఆయేషా సైలెంట్ , అసలు కారణమేంటంటే?

Ramya Moksha: బయట ఉన్న ఫిగర్ ఏంటి.. హౌస్ లో ఉన్న ఫేస్ ఏంటి.. ?

Divvela Madhuri: సింగిల్ నామినేషన్ లేదు… మాధురి నోరు అంటే అంత భయమా ?

Bigg Boss 9 Promo: ఎంటర్టైన్మెంట్ బ్లాస్ట్ కాదు.. ప్రాణాల మీదకు తెచ్చేలా ఉన్నారే!

Bigg Boss 9 Telugu : తెలుగు బిగ్ బాస్ బ్యాన్… నాగార్జునకు ఏం అయింది ?

Big Stories

×