Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక మంచి విజయం కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాడు. ఈ ఏడాది కింగ్డమ్ సినిమాతో వచ్చినా అది కూడా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది.ఇక విజయాపజయాలను పట్టించుకోకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి విజయ్ చాలా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం విజయ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అంతేకాకుండా ఈ మధ్యనే రష్మికతో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. త్వరలో వీరి పెళ్లి జరగనుంది.
ఇక విజయ్ కు సంబంధించిన ఒక పాత విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. లైగర్ రిలీజ్ సమయంలో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్య పాండే కలిసి కరణ్ జోహార్ హోస్ట్ చేసిన కాఫీ విత్ కరణ్ షోకు హాజరయ్యారు. ఈ షోలో కరణ్ ఎలాంటి బోల్డ్ ప్రశ్నలు అడుగుతాడు అనేది అందరికీ తెలుసు.
ఇక ఈ షోలో విజయ్ ను కూడా వదలకుండా అంతే బోల్డ్ ప్రశ్నలు అడిగాడు. విజయ్ కూడా అందుకు తగ్గట్టే సమాధానాలు ఇచ్చాడు. ” నువ్వు ఎప్పుడైనా పబ్లిక్ ప్లేస్ లో శృంగారం చేసావా అన్న ప్రశ్నకు విజయ్ ఏ మాత్రం సంకోచించకుండా అవును చేశాను అని చెప్పుకొచ్చాడు. ఎక్కడ అని అడిగితె బోట్ లో చేశాను.. అవసరం అయితే కారులో కూడా చేస్తాను అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఒకేసారి ముగ్గురితో శృంగారం చేయడంలో తనకేలాంటి ఇబ్బంది లేదని తెలిపాడు.
విజయ్ ఇంత పచ్చిగా మాట్లాడతాడు అనే విషయం ఎవరికీ తెలియదు. సడెన్ గా ఇలా మాట్లాడేసరికి అందరు షాక్ అయ్యారు. ఆ తరువాత ఇది కేవలం స్క్రిప్ట్ అని.. ఇందులో నిజం లేదని తెలిసింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కారణం ఏంటి అనేది తెలియదు కానీ, ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి నెట్టింట వైరల్ గా మారాయి.