Bigg Boss 9 Day 44 Episode Review: ఈ వారం అందరికి కంటెండర్ అయ్యే అవకాశం ఇచ్చాడు బిగ్ బాస్. కానీ, వారు కంటెండర్ అవ్వాలంటే వారి గ్యాంగ్ లీడర్ చేతులో పెట్టాడు. కానీ, వారి కంటెండర్ షిప్ ని మాత్రం వారి గ్యాంగ్ చేతిలో పెట్టాడు బిగ్ బాస్. దీనికోసం బిగ్ బాస్ హౌజ్ ని వాంటెడ్ పేట మార్చాడు బిగ్ బాస్. హౌజ్ లో కంటెస్టెంట్స్ వార్స్ నడుమ బిగ్ బాస్ కెప్టెన్స్ కంటెండర్ టాస్క్ అలర్ట్ ఇచ్చాడు. కంటెండర్ అవ్వాలంటే ముందు బిగ్ బాస్ పెట్టిన పరీక్షలో గెలవాలి. ఇందుకోసం వాంటెడ్ పేట పేరుతో సరికొత్త టాస్క్ ఇచ్చాడు. ఈ వాంటెడ్ పేటలో రెండు క్రిమినల్ గ్యాంగ్ ఉన్నాయి. ఆ రెండు గ్యాంగ్ లకు సంబంధించిన లీడర్స్ గా మాస్ మాధురి, సంజన సైలెన్సర్ ని నిమమించారు. వీరంత బిగ్ బాస్ హౌజ్ లో కరుడు గట్టిన నేరస్థులు. ఇందుకోసం వారికి క్యారెక్టర్లు ఇచ్చి వాటికి సంబంధించిన కాస్ట్యూమ్స్ ఇచ్చాడు బిగ్ బాస్.
ఇమ్మాన్యుయేల్ – నల్ల బాలు, డెమోన్ – సైకో సాంబ, సాయి- పుప్పాడ స్మగ్లింగ్ శ్రీను, తనూజ- టిల్లు బావ, నిఖిల్ – షుగర్ శంకర్, దివ్య – రిచ్ రామ లక్ష్మీ, కత్తి కాంతరావు-సుమన్ శెట్టి, రమ్య – రామ్ పిల్లి అంటూ పాత్రలు ఇచ్చాడు. అయితే ఈ రెండు టీంలో ఎక్కువ మంది సభ్యులు ఉండి.. డబ్బులు ఎవరి దగ్గర ఎక్కువ ఉంటే ఆ టీం గెలిచినట్టు. ఆట మధ్యలో మిగతా వాళ్లు వాళ్ల ఇష్ట ప్రకారం టీం మారోచ్చు. మిగతా వాళ్లు తమ టీంకి వచ్చేలా టీం లీడర్స్ చేసుకోవాలి. ఇలా సంజన.. టీంలో గౌరవ్, రమ్య, డిమోన్ పవన్, నిఖిల్, రాము రాథోడ్ లు. రీతూలు ఉన్నారు. మాధురి టీంలో.. తనూజ, దివ్య, సుమన్ శెట్టి, ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్ లు ఉన్నారు. అయితే ఎవరు కెప్టెన్ కంటెండర్ అవ్వాలనేది మాత్రం మాధురి, సంజనల సంజలను డిసైడ్ చేయాలి.
అలా సమయానుసారంగా పెట్టిన టాస్క్ లో గెలిచిన టీంకి బిగ్ బాస్ డబ్బులు ఇస్తాడు. అలా ఫైనల్ గా ఏ టీంకి ఎక్కువ డబ్బులు ఉంటే వారు గెలిచి కెప్టెన్సీ కంటెండర్స్ గా నిలుస్తారు. ఇందులో భాగంగా పెట్టిన మొదటి లెవెల్ లో ‘గోలీసోడా – బాటిల్ వాలా‘ అనే టాస్క్ లో 50 సోడాలు కొట్టి, 30 సోడాలు తాగాలని కండిషన్ పెట్టాడు. గెలిచిన వాళ్లకు 2000 ప్రైజ్ మనీ. ఈ టాస్క్ లో మాధురి టీం నుంచి ఇమ్మాన్యుయేల్, కళ్యాణ్… సంజన టీం నుంచి రమ్య, డెమోన్ ఆడారు. ఎక్కువ సోడాలు తాగి మాధురి టీం సభ్యులు విన్ అయ్యారు. దీంతో ‘ఇటుక కూడా ఇటుక పెడితే ఇల్లైతాది… మాధురి అక్కతో పెట్టుకుంటే లొల్లయితాది‘ అనే నినాదాలతో మాధురికి ఎలివేషన్ ఇచ్చారు. గెలిచిన జోష్ మాధురి గత్తులెస్తూ చిన్న పిల్లల చిందులేసింది.
గెలిచిన జోష్ లో, ఓడిన బాధలో ఇరు టీం సభ్యుల ఉండగా.. తనూజ, సుమన్ మాత్రం దొంగతానికి స్కేచ్ వేశారు. సంజన టీంకి సంబంధించిన రూ. 2వేలను దొంగలించి తనూజ, సుమన్ లు పంచుకున్నారు. ఆ తర్వాత బయటకు వచ్చిన తమకేం తెలియదన్నట్టు టీంతో కలిసిపోయారు. పైగా డబ్బులు పోయాని తనూజ అనుమానిస్తూ.. నా పేరు తీస్తే అస్సలు బాగోదంటూ యాక్షన్ స్టార్ట్ చేసింది. ఇక తమ డబ్బులు పోయాయని, అవి ఇవ్వకుంటే తాను ఇక గేమ్ ఆడనంటూ సంజన అలిగి కూర్చుంది. ఇక ఈ గేమ్ మధ్యలో సుమన్ సంజనతో డీల్ చేసుకున్నాడు. డబ్బులేమైన ఇస్తే.. మాధురి టీం నుంచి తన టీంకి జంప్ అవుతానంటూ ఒప్పందం చేసుకుంటుంటే..లేదు ఆ టీంలో ఆడి డబ్బులు వచ్చిన తర్వాత మా టీంకి రండి అంటూ సంజన తెలివిగా వ్యవహరించింది. అయితే అస్వస్థత కారణంగా ఆయేషా ఈ టాస్క్ కి దూరంగా ఉంది.