The Raja saab : ప్రతి హీరో బర్త్ డే కి కొన్ని అప్డేట్స్ రావడం అనేది సహజంగా జరుగుతుంది. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఇవ్వనున్న అప్డేట్స్ అన్నీ కూడా సోషల్ మీడియాలో గత రెండు రోజుల నుంచి వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా హీరోస్లో ఒకేసారి హెవీ ప్రాజెక్ట్స్ చేస్తున్న హీరో ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ కంప్లీట్ గా మారిపోయింది. ఏ సినిమా చేసినా కూడా అవన్నీ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే విడుదలవుతున్నాయి. అయితే ప్రభాస్ రేంజ్ మారిపోయింది గాని తనలో ఉన్న ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని చాలా రోజులుగా అభిమానులు మరియు ప్రేక్షకులు మిస్ అవుతున్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని ఒక వినోదాత్మకమైన సినిమాను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు మారుతి.
రాజా సాబ్ సినిమా మీద అందరికీ విపరీతమైన అంచనాలు ఉన్నాయి. సినిమాకి సంబంధించిన వర్క్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతుంది. జనవరి 9న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే సినిమా రిలీజ్ కి చాలా టైం ఉన్నా కూడా ట్రైలర్ ముందే రిలీజ్ చేసేసారు.
అక్టోబర్ 23 ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ వస్తుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. చిత్ర నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కూడా గతంలో ఒక ఇంటర్వ్యూలో మాట్లాడి దీనిని కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం ప్రకారం రాజా సాబ్ సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగల్ ఇంకా పూర్తి కాలేదు.
ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ పూర్తి కాలేదు కాబట్టి నవంబర్ నెలలో ఫస్ట్ సింగిల్ రానున్నట్లు తెలుస్తోంది. రాజా సాబ్ సినిమాకి సంబంధించి ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా కేవలం పోస్టర్ మాత్రమే వస్తుంది.
కేవలం రాజా సాబ్ సినిమాకి సంబంధించిన అప్డేట్ మాత్రమే కాకుండా హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా అప్డేట్ కూడా రానుంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రాబోయే స్పిరిట్ సినిమా అప్డేట్ గురించి కూడా చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. ఏదేమైనా ప్రభాస్ ఫ్యాన్స్ కు ఫస్ట్ సింగిల్ ఆ రోజు రాదు అంటే కొద్దిపాటి నిరాశ కలగడం మామూలే.
Also Read : Anupama Parameswaran : పరదా మీద అశలు పెట్టుకున్నాను, కానీ చాలా బాధపడ్డాను