Shraddha das: హీరోయిన్ శ్రద్ధా దాస్ గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదు.
దశాబ్దమున్నరపాటు గ్లామర్ ఇండస్ట్రీని ఏలింది. అఫ్‌కోర్స్.. ఇప్పుడు అదే చేస్తున్నా, మునుపటి మాదిరిగా లేదన్నది కొందరి వాదన.
37 ఏళ్లు వచ్చినా స్టిల్ తానింకా యంగ్ అని చెప్పే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా.
బాంబేకి చెందిన ఈ బ్యూటీ, సిద్ధూ ఫ్రమ్ సికాకుళం ద్వారా వెండితెరపై అడుగుపెట్టింది.
ఆ తర్వాత కెరీర్ చూసుకోలేదు. తన గ్లామర్‌ను ఉపయోగించుకుని అప్పుడప్పుడు బాలీవుడ్ సినిమాల్లోనూ నటించింది.
కాకపోతే అక్కడ అనుకున్నంత ఫేమస్ కాలేకపోయింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, చివరకు బెంగాలీ సినిమాలోనూ నటించింది.
ప్రస్తుతం ఆమె చేతిలో ఓ ప్రాజెక్టు ఉంది. వీలు చిక్కినప్పుడల్లా వెరైటీగా ఫోటోషూట్స్ ఇస్తూ అలరిస్తోంది.
అభిమానులను పెంచుకుంటూ పోతోంది. లేటెస్ట్‌గా శ్రద్ధాదాస్ రెస్టారెంట్‌కి వెళ్లిన ఫోటోలు నెట్టింగ తెగ తిరిగేస్తున్నాయి.శ్రద్ధా ఎంత క్యూట్‌గా ఉందంటూ చర్చించుకోవడం హార్డ్ కోర్ ఫ్యాన్స్ వంతైంది.