Mohammed Shami: టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా వన్డే సిరీస్ నేపథ్యంలో ఛాన్స్ దక్కని ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా సెలక్షన్ కమిటీ సభ్యులపై హాట్ కామెంట్స్ చేశారు షమీ. ముఖ్యంగా గౌతమ్ గంభీర్ అలాగే అజిత్ అగార్కర్ ఇద్దరు పెద్ద దొంగలు అంటూ బాంబు పేల్చారు. తాను ఎంత బాగా ఆడినా కూడా సెలెక్ట్ చేయడం లేదని ఫైర్ అయ్యారు. తన కెరీర్ నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని ఆరోపణలు చేశారు షమీ. తాను ఫిట్ నెస్ గా ఉన్నప్పటికీ సెలక్ట్ చేయలేదని మండిపడ్డారు.
Also Read: Smriti Mandhana: గిల్ ఓ పిల్లబచ్చా…స్మృతి మందాన కండలు చూడండి…పిసికి చంపేయడం ఖాయం !
తనను ఆస్ట్రేలియా టూర్ కు సెలెక్ట్ చేయకపోవడంపై మహమ్మద్ షమీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అన్ని టోర్నమెంట్లు ఆడినప్పటికీ సెలెక్ట్ చేయడం లేదని నిప్పులు చెరిగారు. తాను చాంపియన్స్ ట్రోఫీ ఆడాను… ఐపీఎల్ 2025 టోర్నమెంటులో కూడా ప్రాతినిధ్యం వహించాను. దిలీప్ ట్రోఫీ కూడా ఆడి తన సత్తా చాటాను. మంచి రిథంలో నేను ఉన్నాను.. అన్నిటిలోనూ పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ సెలెక్ట్ మాత్రం కాలేదని తెలిపారు. నాకే ఎందుకు ఇలా అవుతుంది అని ఎమోషనల్ అయ్యారు. అలాగే సెలెక్టర్ అజిత్ అగార్కర్ పై కూడా ఫైర్ అయ్యారు. మహమ్మద్ షమీ తనకు టచ్ లోకి రాలేదని.. అందుకే అతన్ని సెలెక్ట్ చేయలేదని అజిత్ అగార్కర్ పేర్కొన్న సంగతి తెలిసిందే.
అయితే ఈ అంశంపై కూడా మహమ్మద్ షమీ కౌంటర్ ఇచ్చాడు. నా ఫిట్నెస్ గురించి ఎవరు నాతో చర్చించలేదని… తనను సంప్రదించాల్సిన బాధ్యత అజిత్ అగార్కర్ ది అంటూ కౌంటర్ ఇచ్చారు. టీమిండియాను ఎంపిక చేసేటప్పుడు ప్లేయర్స్ ఫిట్నెస్ గురించి అడగడం సెలెక్టర్ల బాధ్యత అంటూ ఫైర్ అయ్యారు. నన్ను అడుగుతే నేను ఫిట్ గా ఉన్నానా ? లేదా ? అనేది చెప్పేవాణ్ణి అంటూ చెప్పుకొచ్చారు. కానీ నన్ను అడిగేవాడు లేడు.. అలాంటప్పుడు ఎందుకు ఈ సెలక్షన్ కమిటీ ఉందని ఫైర్ అయ్యారు.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఈనెల 19వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రేపు టీమిండియా.. ఆస్ట్రేలియాకు పయనం కానుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే ఢిల్లీకి టీ మీడియా ప్లేయర్లందరూ చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆస్ట్రేలియా వెళ్తారు. ఈ టోర్నమెంట్ లో భాగంగా మూడు వన్డేలు అలాగే ఐదు t20 లు జరగనున్నాయి. గిల్ కెప్టెన్సీలో వన్డేలు ఆడనుంది టీమిండియా. రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ ఇద్దరూ సామాన్య ప్లేయర్లు గానే బరిలో ఉంటారు. సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీలో టి20 లో జరగనున్నాయి.
Mohammed Shami said – "To know about my fitness, you have to ask & understand about my fitness, no one asked my about my fitness. I've been playing regularly Champions Trophy, IPL and all domestic matches. If I get a chance to play the match, then we’ll definitely play". pic.twitter.com/tvaCPihCtZ
— Tanuj (@ImTanujSingh) October 14, 2025