Duvvada Madhuri : బిగ్ బాస్ సీజన్ 9 లో పవర్ స్ట్రోమ్ లో భాగంగా దువ్వాడ మాధురి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దువ్వాడ మాధురి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలా ఇంటర్వ్యూస్ లో ఇంస్టాగ్రామ్ రీల్స్ లో ఆమె విపరీతంగా పాపులర్ అయ్యారు.
హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడానికంటే ముందే ఎవరి రంగులు బయటపడలేదు అందరి రంగులు నేను బయటకు తీస్తాను అని మాధురి నాగార్జునతో చెప్పిన విషయం మనకు గుర్తుంది. అలానే ఇమ్మానుయేల్ తన ఫేవరెట్ కంటెస్టెంట్ అని చెప్పింది. హౌస్ లోకి ఎంటర్రీ ఇవ్వగానే శ్రీజ తో పేరు గురించి ఆర్గ్యుమెంట్ నడిచింది. హౌస్ లోకి రాగానే గొడవపడాలి అనుకుంటున్నావా అని శ్రీజని మొదటిసారి అడిగేసింది.
ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో కళ్యాణ్ కెప్టెన్సీ చేస్తున్నాడు. దివ్య కిచెన్ మానిటర్ గా విధులు నిర్వర్తిస్తుంది. ఈ తరుణంలో కిచెన్ లో దువ్వాడ మాధురి వంట చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కిచెన్ మానిటర్ కాబట్టి ఆ రోజుకి సరిపడా సరుకులని అందించే బాధ్యత దివ్యకు ఉంది. నిన్ననే రెండు కప్పుల పప్పును రెండుపూట్లకు రావాలి అన్నప్పుడు బకెట్ నీళ్ళు పోయాలి అని వెటకారమైన సమాధానం చెప్పింది మాధురి.
మళ్లీ ఈరోజు జరిగిన ఎపిసోడ్ లో కూడా నెక్స్ట్ లెవెల్ ఆర్గుమెంట్ లోకి దిగింది. కూర గురించి మాధురితో దివ్యకు ఆర్గ్యుమెంట్ జరిగింది. ఒక మదర్ గా ఎవరికి ఎంత పెట్టాలో నాకు తెలుసు మీరు నాకు చెప్పకండి అని దివ్య కు మాధురి అంది. మీకు అన్నీ తెలుసు కానీ ఈ హౌస్ లో ఉన్నప్పుడు అందరి గురించి ఆలోచించాలి. నేను కిచెన్ మానిటర్ చేస్తున్నాను కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పింది.
నేను నీతో మాట్లాడను కాబట్టి నేను నీకు చెప్పలేదు అని దివ్య ఉంది. మీరు నాతో మాట్లాడకపోవడం అనేది పర్సనల్ బటన్ నేను కిచెన్ మానిటర్ గా ఉన్నాను కాబట్టి హౌస్ కోసమైనా చెప్పి తీరాలి అంది.
నువ్వు కిచెన్ మానిటర్ గా అసలు సరికాదు. కిచెన్ మానిటర్ ని ముందు మార్చాలి అని కెప్టెన్ కళ్యాణ్ తో మాట్లాడింది దువ్వాడ మాధురి. కళ్యాణ్ వచ్చి మీరు ఐదు రోటి లలో కేవలం మూడు మాత్రమే తింటున్నారు. మీరు ఎక్కువ తింటున్నారు అని మేము కూడా అనలేదు.
కానీ ఇక్కడ ఒక రూల్ కూడా ఉంది. అని చెప్పగానే దివ్య కాదు కళ్యాణ్ నాతో మాట్లాడటం ఆవిడకి ఇష్టం లేదు నాకు కూడా బాండింగ్ అవసరం లేదు అని అంది. అనగానే నాకు కూడా పెద్దగా నీతో బాండింగ్ అసలు అవసరం లేదు నాన్న నాన్న అనడానికి నేను హౌస్ లోకి రాలేదు అని ఇద్దరి మధ్య హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. మొదటి సరిగ్గా మాట్లాడటం నేర్చుకోండి అని మాధురికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది దివ్య. అదే రేంజ్ లో మాధురి కూడా రెచ్చిపోయింది.
Also Read : Ramya Moksha: ఆర్మీ ఆఫీసర్ కి అవమానం.. పచ్చళ్ల పాప నోటి దూ** ఇంకా తగ్గలేదు