Mithra Mandali : రోజులు మారుతున్న కొద్దీ పరిస్థితులు మారుతాయి అంటారు. అలానే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా చాలా మార్పులు వచ్చేసాయి. ఒకప్పుడు మంచి కథ ఉంటే చాలు సినిమాకి ప్రాముఖ్యం అనుకునేవాళ్ళు. ఇప్పుడు కేవలం వినోదాన్ని మాత్రమే నమ్ముకుని చాలామంది దర్శకులు ముందు అడుగులు వేస్తున్నారు. జాతి రత్నాలు సినిమా దగ్గర నుంచి మొదలుపెడితే మొన్నటి వరకు వచ్చిన లిటిల్ హార్ట్స్ వరకు ఈ సినిమాల్లో ఎక్కువ శాతం వినోదానికి పెద్దపీట వేశారు.
అదే తరహాలో చాలామంది యంగ్ డైరెక్టర్స్ కేవలం ఫన్ మాత్రమే రాయడానికి ఇష్టపడుతున్నారు. అదే తరహాలో వస్తున్న సినిమా మిత్ర మండలి. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా మిత్ర మండలి. ఈ సినిమాకి విజయ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా దీపావళి కానుకగా అక్టోబర్ 16న ప్రేక్షకులు ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాత బన్నీ వాసు ఈ సినిమాని నిర్మించారు.
ఈ సినిమా రిలీజ్ సందర్భంగా నిన్న పెట్టిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో బన్నీ వాసు మాట్లాడిన మాటలు తీవ్ర దుమారాన్ని రేపాయి. కావాలనే తన సినిమాని ఎవరో టార్గెట్ చేస్తున్నారు అని మాట్లాడటం హాస్యాస్పదంగా అనిపించింది. ఒక కొత్త నిర్మాత ఇండస్ట్రీలో తన సినిమాని తొక్కడానికి చూస్తున్నారు అని మాట్లాడినట్లు మాట్లాడారు.
కొద్దిసేపటి తర్వాత సైబర్ క్రైమ్ కి కంప్లైంట్ చేసినట్లు. ముగ్గురుని అదుపులోకి తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మిత్ర మండలి అనే సినిమాలో ఏమీ లేదని. ఆ సినిమా సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ కాబట్టి. రేపు పొద్దున్న సినిమా కొనుక్కునే డిస్ట్రిబ్యూటర్లు వచ్చి అడిగితే. మన సినిమా పైన ఎవరో కావాలనే నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు కాబట్టి ఊహించిన సక్సెస్ సాధించలేదు. అని డిస్ట్రిబ్యూటర్లకు సమాధానం చెప్పడం కోసమే బన్నీ వాస్ ఈ స్టంట్ చేశారు అనేది కొంతమంది సినిమా ప్రముఖుల అభిప్రాయం.
దీపావళి కానుకగా మొత్తం నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. వాటిలో మిత్రమండలి ఒకటి. గతంలో లిటిల్ హార్ట్స్ సినిమా విడుదలైనప్పుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో వచ్చిన ఘాటీ సినిమా కూడా విడుదలైంది. అనుష్క ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
అందుకనే ఒకరోజు ముందుగా లిటిల్ హార్ట్స్ కి సంబంధించి పలుచోట్ల ప్రీమియర్ షోస్ వేశారు. ప్రీమియర్ షోస్ కి మంచి రెస్పాన్స్ రావడంతో నెక్స్ట్ రోజు నుంచి కూడా ఆ షో అందుకొని మంచి లాభాలు తీసుకొచ్చి పెట్టింది. అదే తరహాలో మిత్రమండలి కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా ఏమవుతుందో వేచి చూడాలి.
Also Read: Telusu Kada : తెలుసు కదా మూవీ స్టోరీ, ఇదే ఆ కొత్త పాయింట్