Dude Movie Story : షార్ట్ ఫిలిం బ్యాక్ గ్రౌండ్ నుంచి చాలామంది నటులలో ప్రదీప్ రంగనాథన్ ఒకడు. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్ చేసిన ప్రదీప్ రంగనాథన్ కోమాలి సినిమాతో తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు. జయం రవి నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా తర్వాత లవ్ టు డే అనే సినిమా చేశాడు ప్రదీప్. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఒక సంచలనం. ఇదే సినిమాను లవ్ టు డే పేరుతో తెలుగులో కూడా డబ్బింగ్ చేశారు. తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది.
లవ్ టుడే సినిమా తర్వాత ప్రదీప్ రంగనాథన్ క్రేజ్ తెలుగులో విపరీతంగా పెరిగింది. ఆ తర్వాత వచ్చిన డ్రాగన్ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు డ్యూడ్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు ప్రదీప్. ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు ఉన్నాయి. దీపావళి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సినిమా స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. డ్యూడ్ సినిమాలో ప్రదీప్ రంగనాథన్ కి తల్లి తండ్రి ఉండరు. తన మామయ్య కూతురు ను ప్రేమిస్తూ ఉంటాడు. ఈ తరుణంలో సడన్ గా వాళ్ళ మామయ్య కూతురు ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది. ఎవరి వలన అయితే ప్రెగ్నెంట్ అయిందో అతను ఈమెను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అయితే తన వల్లే ప్రెగ్నెంట్ అయింది అని చెప్పి ప్రదీప్ తన పైన ఆ నింద వేసుకుంటాడు.
ఇలా జరుగుతున్న తరుణంలోనే ప్రదీప్ వేరే అమ్మాయితో నిజంగా ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయితో ప్రేమను కొనసాగిస్తున్న తరుణంలోని, తన మేనమామ కూతురు ను ఎవరైతే ప్రెగ్నెంట్ చేశారో ఆ వ్యక్తిని గురించి కనుక్కొని తనను ఆ వ్యక్తితో కలుపుతాడు .
ఓవరాల్ గా సినిమాకి సంబంధించిన కథ ఇది అని తెలుస్తుంది. దీనికి సంబంధించి ట్విస్టులు, చాలా సర్ప్రైజ్ లు ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అన్నింటికీ మించి ప్రదీప్ యూత్ ను ఆకట్టుకునే సినిమాలు చేస్తాడు అని అందరికీ ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఉండబోతుంది.
ఈ రోజుల్లో ఒక సినిమా హిట్ కావడం అనేది మామూలు విషయం కాదు. బాక్సాఫీస్ వద్ద ఒక సినిమా సక్సెస్ సాధించాలి అంటే ఎన్నో దాటుకుని రావాలి. యూనివర్సల్ గా ప్రేక్షకులు చాలా కంటెంట్ చూడటం మొదలుపెడుతున్నారు. వాటన్నిటిని మించి ఒక సినిమా ప్రేక్షకుడిని ఆకట్టుకోవాలి అంటే ఆ సినిమా చాలా పవర్ ఫుల్ గా ఉండాలి. అంతటి వర్త్ డ్యూడ్ సినిమాకి ఉంది అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సక్సెస్ అయితే ప్రదీప్ హ్యాట్రిక్ హిట్ కొట్టినట్టే.
Also Read : Bigg Boss Ritu Chaudhary : రీతూ చౌదరికి సీజన్ అంతా అడుక్కోవడమే పని అయిపోయింది