Bigg Boss Telugu 9 Divya Vs Madhui: వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత బిగ్ బాస్ ఆసక్తికరంగా మారింది. దువ్వాడ మాధురి ఎంట్రీ ఇస్తుందనేగానే అంతా ఆమె ఆటను చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిజం చెప్పాలంటే ఆమె ఆట కంటే కూడా హౌజ్ ఆమె ఫైర్ స్ట్రోమ్ చూడాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందరి ఊహించినట్టుగానే మాధురి తన నోటి వాటం చూపించింది. వంట విషయంలో ఎంత రచ్చ జరుగుతుందో ప్రొమోల్లో చూస్తూనే ఉన్నారు. మాట్లాడాలి కూర్చోండి అంటూ కెప్టెన్ కూల్ అడిగితే.. కూర్చోకుంటే చెప్పరా అంటూ సెటైర్ వేసింది. మాధురి తీరుకు విసుక్కున్న దివ్య తన ఫైర్ ఎంటో చూపించడం మొదలు పెట్టింది. అప్పటి నుంచి ఇద్దరి మధ్య యుద్దమే తప్ప మాటల్లెవ్. చిన్న చిన్న విషయానికే ఇద్దరు ఆర్గ్యూ చేసుకుంటున్నారు.
వంట దగ్గర మొదలైన ఈ హీట్ నామినేషన్ వరకు వెళ్లింది. ఈ రోజు ఎపిసోడ్ లో బాల్ చేజిక్కించుకున్న మాధురి నామినేషన్ చేసేందుకు రీతూకి ఇచ్చింది. దీంతో రీతూ భరణి, దివ్యలను నామినేట్ చేసింది. రీతూ వివరణ.. హౌజ్ లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బ్రేక్ ఫాస్ట్ లేట్ అవ్వలేదు. ఈ రోజే లేట్ అయ్యింది. దీనికి కారణం నువ్వే. ఫుడ్ మానిటర్ గా ఉంది నువ్వే కాబట్టి.. దీనికి బాధ్యత నువ్వే అందుకే నామినేట్ చేస్తున్నాను అని చెప్పింది. మీమీ మధ్య డిస్ట్రబెన్స్ వల్ల హౌజ్ లో చాలా మందికి టైంకి బ్రేక్ ఫాస్ట్ అందక.. అందరు ఆకలితో మాడారు అని వివరణ ఇచ్చింది. రీతూ డిసిజన్ ని ఫైనల్ చేసేందుకు మాధురి రంగంలోకి వచ్చింది. భరణిని సేవ్ చేసి దివ్యని నామినేట్ చేసింది. ఈ విషమైన తన వివరణ ఇస్తున్న క్రమంలో మరోసారి దివ్య, మాధురిలా మధ్య వాగ్వాదం మొదలైంది.
మేమంత కొత్తగా వచ్చాం. మాకేం తెలియదు. మాకు కో ఆపరేట్ చేయాల్సింది పోయి మాపై అరుస్తున్నారు. అది నాకు నచ్చలేదంటూ మాధురి తన కారణాలు చెబుతుంది.దీనికి దివ్య ఎదుటి వాళ్ల మాటలను బట్టి నా రియాక్షన్ ఉంటుందని, మీరు మాట్లాడితే మాట్లాడతా.. అరిస్తే అరుస్తాను అని చెప్పింది. దీనికి మాధురి మీరు తీరు నాకు నచ్చడం లేదు.. వచ్చినప్పుటి నుంచి చూస్తున్నా మీరు భరణి గారెతో తప్ప ఇంకొక్కరితో ఇంటారాక్ట్ అవ్వడం లేదు అని అంటుంది. మాధురి అలా అనగానే దివ్య వెంటనే అందుకుని నాకు మీతో ఇంటారాక్ట్ అవ్వాలని లేదు మొహం మీదే కొట్టినట్టు సమాధానం ఇచ్చింది. ఈ పొగరు వల్లే నిన్ను నామినేట్ చేస్తున్నా అని చెప్పి వెళ్లిపోతుంది.
Also Read: Bigg Boss Telugu 9: ముగిసిన నామినేషన్ ప్రక్రియ.. ఈ వారం హౌజ్ ని విడేది వీళ్లే, ఎవరేవంటే!
నామినేషన్ ప్రక్రియ ముగియగానే దివ్య.. రీతూతో.. వేరే వాళ్ల తో పాయింట్ లేదని నన్ను నామినేట్ చేశావు.. కానీ, ఆమె తన పర్సనల్ గర్జ్ ని చూపించింది. నీ నామినేషన్ వల్ల తను నా మీద, నా ఆట్యూటుడ్, నా క్యారెక్టర్ పై నా మిద నిందలు వేసిందని చెప్పుకుంటుంది. ఆ తర్వాత దివ్య.. భరణితో నేను ఇక్కడ సీరియల్ విలన్ ని అయిపోయానంటూ ఆవేదన చెందింది. బోర్డు టాస్క్ లో రీతూకే సపోర్టు చేసిన అయినా తను నన్నే నామినేట్ చేసింది. రీతూని సేవ్ చేసేందుకు కష్టమైన టాస్క్ ఆడి నడుము పడిపోయేంతలా సపోర్టు చేశాను. నాకూ టైం వస్తుంది.. నా పాయింట్ వస్తుంది.. అప్పుడు చెప్తా.. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కుతా అంటూ దివ్య రీతూపై ఫైర్ అయ్యింది.