Telusu Kada : ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన తెలుసు కదా సినిమాతో దర్శకురాలుగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. తెలుసు కదా అనే టైటిల్ వినగానే చాలా క్లాస్ గా ఉంది అని అందరికీ సినిమా మీద ఒక రకమైన అభిప్రాయం మొదలైంది. ఇకపోతే ఈ సినిమా ట్రైలర్ చూసిన వెంటనే అందరికీ సినిమా మీద ఉన్న అంచనాలు కంప్లీట్ గా మారిపోయాయి. ట్రైలర్ విపరీతంగా నచ్చడంతో ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరిగాయి. అప్పటివరకు సాఫ్ట్ అనుకున్న సినిమా ఇంకేదో ఉంది అనే ఫీల్ అయితే ట్రైలర్ క్రియేట్ చేసింది.
జాక్ సినిమా తర్వాత సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. సినిమా సక్సెస్ సిద్దు కెరీర్ కి చాలా అవసరం. సిద్దు జొన్నలగడ్డ తో పాటు శ్రీనిధి శెట్టి, రాశి ఖన్నా కీలకపాత్రలో నటిస్తున్నారు. అయితే ముగ్గురు నటిస్తున్నారు కాబట్టి ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అందరూ ఊహించరు. ఊహించిన విధంగానే ట్రైలర్ కూడా ఉంది. అయితే ఈ సినిమాలో ఒక కొత్త పాయింట్ ఉంది అని ఇండస్ట్రీ వర్గాల్లో సమాచారం వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అసలేంటి ఈ కొత్త పాయింట్ అని సర్వత్ర ఆసక్తి నెలకొంది.
సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాలో రాశి ఖన్నాతో ప్రేమలో ఉంటాడు. వారిద్దరికీ మధ్య మంచి బాండింగ్ ఏర్పడుతుంది. కానీ ఒకానొక టైం లో తనకి పిల్లలు పుట్టరు అని తెలుస్తుంది. బేసిక్ గా చాలామందికి పిల్లలు అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. ప్రెగ్నెన్సీ అనేది వాళ్లు ఒక ఎమోషన్ల ఫీల్ అవుతూ ఉంటారు. పిల్లలు పుట్టరు అని తెలిసిన వెంటనే. సరోగసి ద్వారా పిల్లల్ని కనాలి అని ఫిక్స్ అవుతారు.
సరోగసి ద్వారా పిల్లలకనే ప్రాసెస్ లో శ్రీనిధి శెట్టి పరిశ్రమ అవుతుంది. వీళ్లు ముగ్గురు మధ్య ఏం కథ జరిగింది అనేది సినిమా స్టోరీ. మెయిన్ పాయింట్ ఇది అయినా కూడా ఈ కథకు సంబంధించి చాలా లేయర్స్ సినిమాలో ఉంటాయి. కొత్త కాన్సెప్ట్ అని చాలామంది అంటున్నారు. కానీ ఇది మరీ కొత్త పాయింట్ ఏమీ కాదు.
ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు వంటి సినిమాల కాన్సెప్ట్ ఈ సినిమాలో కనిపిస్తుంది అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సిద్దు జొన్నలగడ్డ ఈ సినిమాలో చూడటానికి చాలా అందంగా కనిపిస్తున్నాడు. స్వతహాగా నీరజ కోన కాస్ట్యూమ్ డిజైనర్ కావడంతో సిద్దు వేసుకునే బట్టలు మాత్రం చాలా అందంగా ఉన్నాయి.
Also Read: Dude Movie Story : ప్రదీప్ రంగనాథన్ డ్యూడ్ సినిమా కంప్లీట్ మూవీ స్టోరీ ఇదే