BigTV English

Tripti Dimri : డబ్బులు తీసుకుని మోసం చేసింది… ‘యానిమల్’ హీరోయిన్ కొత్త వివాదం

Tripti Dimri : డబ్బులు తీసుకుని మోసం చేసింది… ‘యానిమల్’ హీరోయిన్ కొత్త వివాదం

Tripti Dimri : ‘యానిమల్’ సినిమాలో బోల్డ్ సీన్స్ తో దుమ్మురేపిన హీరోయిన్ తృప్తి తాజాగా కొత్త వివాదంలో చిక్కుకుంది. ఆమె ముఖంపై బ్లాక్ ఇంక్ మార్క్ చేసి నిరసనను వ్యక్తం చేయడమే కాకుండా తన సినిమాలను బ్యాన్ చేయాలంటూ లేడీ వ్యాపారవేత్తలు ఫైర్ అయ్యారు. ఇంతకీ వివాదం ఏంటో తెలుసుకుందాం పదండి.


వివాదం ఏంటంటే?

‘యానిమల్’ సినిమాతో ఓవర్ నైట్ పాపులర్ అయిన హీరోయిన్ తృప్తి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. అంతకు ముందు నుంచే ఆమె సినిమాలు చేస్తున్నప్పటికి ‘యానిమల్’తోనే మంచి పాపులారిటీ దక్కింది. ఇక ఇప్పుడు చేతిలో దాదాపు అరడజను సినిమాలు పెట్టుకుని క్షణం తీరిక లేకుండా ఉన్న ఈ బ్యూటీ కేవలం సినిమాలే కాకుండా పలు యాడ్స్, ఈవెంట్స్ కూడా చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఈవెంట్ కి హాజరవుతానని చెప్పి లక్షల రూపాయలు తీసుకొని ఆమె ముఖం చాటేయడంతో వివాదం మొదలైంది. ఈ క్రమంలోనే ఆమెకు డబ్బులు ఇచ్చిన వ్యాపారవేత్తలు ఫైర్ అవుతూ, ఆమె సినిమాలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.


తృప్తి సినిమాలు బ్యాన్…

జైపూర్ కి చెందిన మహిళా వ్యాపారవేత్తలు ఎఫ్ఐసిసిఐ ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో తాజాగా ఓ ఈవెంట్ ను నిర్వహించారు. సోమవారం సాయంత్రం ఈవెంట్ జరగగా,, దానికి గెస్ట్ గా తృప్తి దిమ్రి హాజరు కావలసి ఉంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఈవెంట్ నిర్వాహకుల దగ్గర 5.5 లక్షలు గెస్ట్ గా హాజరు కావడానికి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈవెంట్ స్టార్ట్ కావడానికి ఐదు నిమిషాల ముందు వరకు ‘వస్తున్నాను.. వస్తున్నాను’ అని చెప్పి, తీరా ఈవెంట్ అయిపోయినా సరే రాకుండా హ్యాండ్ ఇచ్చిందట. దీంతో మహిళా వ్యాపారవేత్తలు ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ, ఆమె కోసం ఏర్పాటు చేసిన బ్యానర్ పై నల్లని పెయింట్ వేసి నిరసనను వ్యక్తం చేశారు. ఆ టైంలో ఈవెంట్ నిర్వాహకురాలు ఘటనపై స్పందిస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన తృప్తి పై లీగల్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించింది. అంతేకాకుండా జైపూర్ లో ఆమె సినిమాలను బ్యాన్ చేస్తామని, తమని ఇలా మోసం చేయడం కరెక్ట్ కాదు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరి తృప్తి అసలు ఈవెంట్ కి ఎందుకు హాజరు కాలేదు? ఈ విషయంపై ఎలా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. కానీ మంచి పాపులారిటీతో దూసుకెళ్తున్న ఇలాంటి టైం లో ఇలా వివాదాల మధ్య చిక్కుకోవడం అనేది ఆమె కెరీర్ కు సమస్యగా మారే ఛాన్స్ ఉంది. నిన్న మొన్నటి దాకా ఆమె చేసిన డాన్స్ మూవ్స్ పై నెటిజెన్లు ఫైర్ అయ్యారు. వాటిని అసలు పట్టించుకునే అవసరం లేదంటూ సర్ది చెప్పింది తృప్తి. కానీ ఇలా డబ్బులు తీసుకొని ఒక ఈవెంట్ ను ఎగ్గొట్టడం అనేది ఆమె కెరీర్ కి మాయని మచ్చగా మారే ఛాన్స్ ఉంది. మరి ఈ బోల్డ్ బ్యూటీ  దీనికేం సమాధానం చెబుతుందో చూడాలి.

Related News

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big Stories

×