Challa Dharma reddy: బీఆర్ఎస్ నేత చల్లా ధర్మారెడ్డిపై ఫోర్జరీ కేసు నమోదైంది. ఆయనతో పాటు రియల్టర్ పురుషోత్తమ్ నాయుడుపై మాదాపూర్ పీఎస్‌లో కేసు పెట్టారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని విజన్ రిసార్ట్స్ పార్ట్‌నర్ రాజశేఖర్‌రావు ఆ ఫిర్యాదు చేశారు.
రాజకీయ నేతలు అధికారంలో ఉంటే ఒకలా లేకుంటే మరోలా ఉంటారని కొందరు సీనియర్ రాజకీయ నేతలు చెబుతారు. ఒక్కోసారి చేసిన పాపాలు సైతం వెంటాడుతాయి. లేటెస్ట్‌గా ఉమ్మడి వరంగల్ జిల్లా పరకాల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి కష్టాలు రెట్టింపు అయ్యాయి.
ALSO READ: బతుకమ్మ ఉత్సవాలు.. కవిత దూరం.. రీఎంట్రీ వెనక్కి?
చల్లా ధర్మారెడ్డితోపాటు రియల్టర్ పురుషోత్తం నాయుడుపై ఫోర్జరీ కేసు నమోదైంది. విజన్ రిసార్ట్స్ పార్ట్నర్ గంటా రాజశేఖర్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. తన ఇంట్లోకి చొరబడి సంతకాలు పెట్టమని ధర్మారెడ్డి బెదిరించారన్నది అందులో ముఖ్యమైన పాయింట్.
అంతేకాదు తనకు తెలియకుండానే ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు బాధితుడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. బాధితుడు తీసుకొచ్చిన పేపర్లను పరిశీలించారు. మరి పోలీసుల దర్యాప్తులో ఇంకెన్ని విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై ఫోర్జరీ కేసు నమోదు!
బీఆర్ఎస్ నేత, పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మరియు రియల్టర్ పురుషోత్తం నాయుడుపై ఫోర్జరీ కేసు నమోదైంది.
విజన్ రిసార్ట్స్ పార్ట్నర్ గంటా రాజశేఖర్ రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు.
తన ఇంట్లోకి చొరబడి… pic.twitter.com/Ni8OfJRPmS
— BIG TV Breaking News (@bigtvtelugu) October 2, 2024