Womens World Cup 2025: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంటులో ( Womens World Cup 2025 ) టీమిండియా పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. ఈ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో సెమీ ఫైనల్ కు టీమిండియా చేరాలంటే సంక్లిష్టమైన పరిస్థితి నెలకొంది. ఈ టోర్నమెంటులో రెండు మ్యాచ్ లు గెలిచిన టీమిండియా మరో రెండు మ్యాచ్ లు వరుసగా ఓడిపోయింది. సౌత్ ఆఫ్రికా అలాగే ఆస్ట్రేలియా జట్ల చేతుల్లో టీమిండియా ఓడిపోయి, సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా చేసుకుంది. ఇక తన తర్వాతి మ్యాచ్ ఇంగ్లాండ్ లాంటి భయంకరమైన జట్టుతో ఆడనుంది. ఈనెల 19వ తేదీన టీమ్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అలాగే న్యూజిలాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య ఈనెల 23వ తేదీన మ్యాచ్ ఉండనుంది. టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఈనెల 26వ తేదీన బిగ్ ఫైట్ జరగనుంది.
బంగ్లాదేశ్ మినహా ఇంగ్లాండ్ అలాగే న్యూజిలాండ్ జట్లపైన టీమిండియా రికార్డు పెద్దగా బాగాలేదు. ఆ రెండు జట్లపైన టీమ్ ఇండియా గెలవడం కష్టమే అని అంటున్నారు. అయితే ఈ రెండు జట్లపైన జరిగిన చివరి సిరీస్ లలో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఇక వరల్డ్ కప్ లీగ్ దశలో మిగిలిన మూడు మ్యాచ్ లలో టీమిండియా గెలిస్తే సెమీస్ కు వెళ్లే అవకాశం ఉంటుంది. లేదంటే కనీసం రెండు మ్యాచ్ లలోనైనా గెలవాలి. అదే సమయంలో మెరుగైన నెట్ రన్ రేట్ మైంటైన్ చేస్తే క్వాలిఫై కావచ్చు. అదే సమయంలో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లు తమ తర్వాతి మ్యాచ్ లలో కచ్చితంగా ఓడిపోవాలి. అప్పుడు టీం ఇండియా నాలుగో స్థానంలోనే కొనసాగుతుంది. దానివల్ల టీమ్ ఇండియాకు అడ్వాంటేజ్ జరుగుతుంది. దానికి తోడు ఆస్ట్రేలియా అలాగే ఇంగ్లాండ్ ఇటు సౌతాఫ్రికా ప్రతి మ్యాచ్ గెలవాలి.
Also Read: Smriti Mandhana: గిల్ ఓ పిల్లబచ్చా…స్మృతి మందాన కండలు చూడండి…పిసికి చంపేయడం ఖాయం !
ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరిగింది. ఈ టోర్నమెంట్ లో భాగంగా శ్రీలంక వర్సెస్ న్యూజిలాండ్ మహిళల జట్ట మధ్య అదిరిపోయే మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో ఫలితం మాత్రం తేలలేదు. ఈ మ్యాచ్ కు వర్షం అడ్డంకిగా మారడంతో చెరో పాయింట్ లభించింది. దీంతో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ పాయింట్ల పట్టికలో పెద్దగా మార్పులేని జరగలేదు. కానీ టీమిండియా ప్లే ఆఫ్ ఆశలపై సరికొత్త చర్చ మొదలైంది. కచ్చితంగా తన తర్వాతి మ్యాచ్ లలో టీమిండియా గెలవాల్సి ఉంటుంది. గెలవకపోతే, ఇంటి దారి పట్టాల్సిందే.