Triptii Dimri: ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా ఒక హీరోయిన్ జీవితాన్ని మార్చేసింది. ఆ హీరోయిన్ ఎవరో కాదు త్రిప్తి డిమ్రి.
అనిమల్ సినిమాతో ఈ చిన్నది ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయింది. జోయా పాత్రలో ఆమె నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
ముఖ్యంగా రణబీర్ తో ఇంటిమేటెడ్ సీన్స్.. ఎవరెవరో సాంగ్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పాలి. త్రిప్తి డిమ్రి కెరీర్ గురించి చెప్పాలంటే అనిమల్ కు ముందు అనిమల్ తరువాత అని చెప్పుకోవచ్చు.
ఇక అనిమల్ సినిమా తరువాత అమ్మడి రేంజ్ మారిపోయింది. స్టార్ హీరోల సరసన ఈ చిన్నది నటిస్తూ మంచి విజయాలను అందుకుంటుంది.
ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. సోషల్ మీడియాలో కూడా అమ్మడు యమా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం హాట్ హాట్ ఫొటోస్ తో కుర్రకారుకు కిర్రెక్కిస్తూ ఉంటుంది.
తాజాగా ఈ చిన్నది టిరా కాస్మొటిక్స్ ఈవెంట్ లో పాల్గొంది. ఆ ఈవెంట్ కు సంబంధించిన ఫొటోస్, వీడియోస్ ను అభిమానులతో పంచుకుంది.
రెడ్ కలర్ సెయింట్ లారెంట్ లేటెక్స్ డ్రెస్‌లో యమా హాట్ గా కనిపించింది. ఫిట్టింగ్ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో హై రౌండ్ నెక్, కట్-అవే ఆర్మ్‌హోల్స్… టోన్డ్ బాడీ ఆమె అందాన్ని ఇంకా పెంచాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.