రాహుల్ గాంధీ చూపిస్తున్న రాజ్యాంగం రెడ్ లేబుల్ కలిగిన బుక్ ఖాళీ పేజీలతో ఉందని ప్రధాని మోడీ చేసిన కామెంట్లకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. రాజ్యాంగాన్ని ఎప్పుడూ చదవనందుకే మోడీ రాజ్యాంగం ఖాళీగా ఉందని భావిస్తున్నారని విమర్శించారు. మహారాష్ట్రలోని నందుబాబర్ లో జరిగిన ర్యాలీలో రాహుల్ మాట్లాడుతూ.. రాజ్యాంగంలో మహాత్మాగాంధీ, అంబేద్కర్, బిర్సా ముండా లాంటి గొప్పవారు రూపొందించిన ఉన్నాయన్నారు.
తాను తీసుకెళ్లిన రాజ్యాంగ ప్రతి ఎరుపు కవర్ తో ఉండగా బీజేపీ నాయకులు విమర్శించారని అన్నారు. ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అర్బన్ నక్సల్స్ మరియు అరాచకవాదులకు మద్దతు ఇచ్చారని వ్యాఖ్యానించారంటూ మండిపడ్డారు. పుస్తకం రంగు ఎరుపు అని బీజేపీకి అభ్యంతరాలు ఉన్నాయని, కానీ తాము ఎరుపు రంగా నీలం రంగా అని పట్టించుకోలేదని చెప్పారు.
రాజ్యాంగాన్ని పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అంతే కాకుండా రాజ్యాంగ పరిరక్షణకు ప్రాణాలు ఇవ్వడానికి అయినా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భారత దేశ మౌళిక సూత్రాలను బీజేపీ ఎప్పుడూ కించపరుస్తూనే ఉంటుందని విమర్శించారు. ఈ బుక్ ఖాళీగా లేదని, దేశానికి సంబంధించిన ఆత్మ, ఎంతో నాలెడ్జ్ ఉన్నాయని అన్నారు. ఆదివాసీలే ఈ దేశానికి మూలవాసులని కానీ తొంభై మంది అధికారులు ఉంటే అందులో కేవలం ఒక్కరు మాత్రమే ఆదివాసీలు ఉన్నారని చెప్పారు.