50 Years Of Mohan Babu : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న విలక్షణమైన నటులలో మోహన బాబు ఒకరు. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ మొదలు పెట్టిన మోహన్ బాబు తర్వాత నటుడుగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగించారు. నటుడుగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత విలన్ గా మంచి గుర్తింపును పొందుకున్నారు. ఇప్పటికీ కూడా కొన్ని సినిమాల్లో మోహన్ బాబు చేసిన విలనిజం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మోహన్ బాబు గొప్ప నటుడు అని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన పాత్రలే ఉదాహరణలు.
విలన్ గా కొన్ని పాత్రలు చేసిన తరుణంలో హీరోగా కూడా తన కెరీర్ ని మలుపు తిప్పారు. తాను హీరోగా చేసిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టయి. ఇప్పటికీ మోహన్ బాబుకి కలెక్షన్ కింగ్ అనే బిరుదు కూడా ఉంది. అయితే మోహన్ బాబు ఇప్పటికీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 50 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఈ తరుణంలో ఒక గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు.
ఇండస్ట్రీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకోవడమనేది మామూలు విషయం కాదు. మనలో ఎంతో టాలెంట్ ఉంటే గానీ అన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో నిలబడలేము. అయితే 50 సంవత్సరాలు మోహన్ బాబు పూర్తి చేసుకున్న సందర్భంగా నవంబర్ 22న ఒక గ్రాండ్ ఈవెంట్ జరగనుంది.
ఈ గ్రాండ్ ఈవెంట్ కు తెలుగు సినిమా పరిశ్రమలోని ప్రముఖులంతా హాజరవుతున్నారు. మోహన్ బాబు గురించి వాళ్లంతా ఏం మాట్లాడబోతున్నారు అనే క్యూరియాసిటీ చాలామందికి ఉంది.
మోహన్ బాబు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతారు. అలానే కొన్ని సందర్భాల్లో ఆయన మాట్లాడే మాటలు వింటుంటే డబ్బా కొట్టుకుంటున్నారు అని అభిప్రాయం రావడం సహజంగా జరుగుతుంది.
గతంలో రజినీకాంత్ ను ఏక వచనంతో రోబో సినిమా ఈవెంట్ లో సంభోదించారు. అప్పుడే మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఒక వేదిక పైన అలా మాట్లాడకూడదు అని చెప్పేశారు.
మరొక సందర్భంలో అక్కినేని నాగేశ్వరరావు కంటే నేను చాలా గొప్ప నటుడిని అని కూడా చెప్పారు. వెంటనే అక్కినేని నాగేశ్వరరావు కూడా తనదైన శైలిలో పిచ్చివాడు కదండీ ఏది పడితే అది మాట్లాడుతుంటాడు అని మోహన్ బాబుని అనేశారు.
ఇలాంటి ఉదాహరణలు చెప్పడానికి చాలా ఉన్నాయి. అయితే ఈ ఈవెంట్ లో మోహన్ బాబు తన స్వడబ్బాతో పాటు ఎటువంటి వైరల్ స్పీచ్ ఇస్తాడో అని ఇండస్ట్రీ వర్గాల్లో చాలామంది ఇప్పటికే డిస్కషన్ చేయడం మొదలుపెట్టారు.
Also Read: Bigg Boss 9 : పోకిరి లెవెల్ ట్విస్ట్, దివ్య కు ఇచ్చి పడేసిన భరణి, అసలైన విలనిజం