Sigma : కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో కూడా మంచి సర్కిల్ మెయింటైన్ చేస్తుంటాడు తెలుగు హీరో సందీప్ కిషన్. లోకేష్ కనగరాజ్ ను కూడా సందీప్ కిషన్ పరిచయం చేశాడు. నగరం సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఇప్పుడు లోకేష్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. రజనీకాంత్ మరియు కమలహాసన్ వంటి స్టార్ హీరోలతో పనిచేసిన అనుభవం లోకేష్ కు ఉంది.
ఒకవైపు తెలుగులో సినిమాలు చేస్తూ మరోవైపు తమిళ్ దర్శకులతో కూడా సినిమాలు చేస్తున్నాడు సందీప్ కిషన్. తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి కుమారుడు జాసన్ సంజయ్ దర్శకుడుగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకి హీరోగా నటిస్తున్నాడు సందీప్ కిషన్. ఆ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. దానికి కారణం విజయ్ కుమారుడు డైరెక్టర్ అవ్వటం.
జాసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ నటిస్తున్న సినిమాకు సిగ్మా అనే టైటిల్ ఖరారు చేశారు. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదలైంది. కోలీవుడ్ వర్గాల్లో ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర కథ వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజం అనేది చాలామందికి క్లారిటీ లేదు.
ఈ సినిమా డబ్బు మరియు గోల్డ్ అలానే క్యాషినో గేమ్ చుట్టూ తిరుగుతుంది అని తెలుస్తుంది. తన తండ్రి చేసిన అప్పులను కొడుకు తీర్చే కథ ఈ సినిమా అని కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తుంది. అయితే ఈ లైన్ తో చాలా సినిమాలు ఇప్పటివరకు వచ్చాయి.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన సినిమా సన్నాఫ్ సత్యమూర్తి. ప్రకాష్ రాజ్ సత్యమూర్తి అనే పాత్రలో కనిపించారు. అయితే ప్రకాష్ రాజ్ చనిపోయిన తర్వాత ఆ కుటుంబం యొక్క పరిస్థితులు కంప్లీట్ గా ఆ సినిమాలో మారిపోతాయి.
అప్పటివరకు రిచ్ లైఫ్ అనుభవించిన ఆనంద్ విరాజ్ అని అల్లు అర్జున్ క్యారెక్టర్ ఎలా కం బ్యాక్ ఇచ్చారు. వాళ్ల తండ్రి చేసిన అప్పులకు బాధ్యత తీసుకొని ఎలా క్లియర్ చేశారు అని కాన్సెప్ట్ మీదే ఈ సినిమా ఉంటుంది.
మరోవైపు జాసన్ సంజయ్ స్క్రిప్ట్ కూడా అలానే ఉంటుంది అని అర్థమవుతుంది. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అనే విషయం పైన ఎవరికీ క్లారిటీ లేదు.
Also Read: 50 Years Of MohanBabu : మోహన్ బాబుకు గ్రాండ్ ఈవెంట్, ఈసారి ఏ వైరల్ స్పీచ్ ఇస్తారో?