Bigg Boss : ప్రస్తుతం ప్రతి ఇండస్ట్రీలోనూ బిగ్ బాస్ రియాలిటి ప్రసారం అవుతుంది. తెలుగుతోపాటు తమిళ్లో కూడా ఈ షోకు మంచి ఆదరణ లభిస్తుంది. ఎనిమిదవ సీజన్ వరకు విలక్షణ నటుడు కమలహాసన్ హోస్టుగా వ్యవహరించారు. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ షోకి హౌస్ట్ గా చేస్తున్నారు. తొమ్మిదో సీజన్ మొదలై చాలా వారాలే అవుతుంది. అయితే ఈ షో మొదలైనప్పటి నుంచి ఏదో ఒక వివాదం తలెత్తుతూనే ఉంది. మొన్నటి వరకు హౌస్ మేట్స్ మధ్య గొడవలు ఉంటూ కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి. భాషగా మరోసారి ఈ షో పై వివాదం తలెత్తింది. ఏ ఇండస్ట్రీకి లేనివిధంగా తమిళ్ బిగ్ బాస్ కు పొలిటికల్ సెగ మొదలైంది.. ఓ రాజకీయ పార్టీ ఈ షోకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తూ ప్రజల మనోభావాలను దెబ్బతీసే ఇలాంటి షోలను బ్యాన్ చేయాలంటూ డిమాండ్ చేస్తుంది. ఒక ఎంటర్టైన్మెంట్ షో కి పొలిటికల్ వార్ రావడం ఏంటి అని ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది.. అసలేం జరిగింది? ఎందుకు ఎన్ని రోజులు తర్వాత బిగ్ బాస్ పై వ్యతిరేకత మొదలైంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
తమిళ టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ పై రోజుకో వార్త వినిపిస్తుంది. బిగ్ బాస్ అంటే ప్రతి ఇండస్ట్రీలో ను వ్యతిరేకత మొదలవుతుంది. ఇది ఇప్పటివరకు జనాలు మాత్రమే సోషల్ మీడియాలో ఈ షో ఆసక్తికంగా ఉందంటే పోస్ట్లు పెడుతూ బ్యాన్ చేయాలంటే డిమాండ్ చేశారు. కానీ తమిళ బిగ్ బాస్ కు పొలిటికల్ వార్ మొదలైంది. తమిళగ వజ్వురిమై కట్చి సభ్యులు ఈ షోను బ్యాన్ చెయ్యాలని నినాదాలు చేస్తూ రోడ్ల పై నిరసనలు చేస్తున్నారు. తమిళ సమాజానికి హాని కలిగించే ప్రదర్శనను నిరసిస్తూ నిరసనకారులు విజయ్ సేతుపతి దిష్టిబొమ్మలను కొట్టారు. దాంతో గొడవలు వస్తాయని పోలీసులు రంగంలోకి దిగారు.. నిరసన కారులకు పోలీసులు నచ్చజేప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read :మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ రెండు వెరీ స్పెషల్..
ఎమ్మెల్యే వేలుమురుగన్ బిగ్ బాస్ షో పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక సినిమాను మించిన సీన్లు చూపిస్తున్నారు. ముద్దు సన్నివేశాలు మరియు పడకగది దృశ్యాలు ప్రసారం అయ్యాయి. తమిళ సమాజానికి ఏదైనా నష్టం జరిగినా స్క్రిప్ట్ రైటర్లు పట్టించుకోరు. డబ్బు చాలా ముఖ్యం అనే ప్రాతిపదికన వారు ప్రోగ్రామ్‌ను నడుపుతున్నారు. దీనివల్ల జనాలకు ఏమి ఉపయోగం లేదని ఆయన వ్యాఖ్యానించారు. బిగ్ బాస్ తమిళ్ కంటెంట్ అన్ని వర్గాల ప్రేక్షకులకు స్నేహపూర్వకంగా లేదని విమర్శించారు. యువత, పిల్లల సమక్షంలో చూడలేమని చెప్పారు.వారు ఇప్పటి వరకు శృంగారాన్ని ప్రదర్శించకుండా మాత్రమే నిలిపివేసారు. యువతను చెడగొట్టేలా హౌస్ లో జరుగుతున్నాయి. అసభ్యకరమైన ప్రోగ్రామ్‌ను హోస్ట్ చేయడం ద్వారా డబ్బు సంపాదించాలా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై బిగ్ బాస్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఇకపోతే ప్రస్తుతం విజయ్ టీవీలో బిగ్ బాస్ తమిళ సీజన్ 9 ప్రసారం అవుతోంది. 24 మంది కంటెస్టెంట్స్‌తో షో ప్రారంభమైంది. ఒక హౌస్‌మేట్ షో నుండి బయటకు వెళ్లడంతో ఆరుగురు ఇప్పటికే ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్లారు. ప్రస్తుతం ఈ షో ఉంటుందా ఆగిపోతుందా అనేదానిపై సోషల్ మీడియాలో చర్చినీయాంశంగా మారింది.