OTT Movie : ఫెమినిజం లవర్స్, హిస్టారికల్ డ్రామా ఇష్టపడేవాళ్లకు, ఒక అదిరిపోయే సిరీస్ ఓటీటీలోకి వస్తోంది. 1970లలో ఇటలీలో మొట్టమొదటి శృంగార పత్రిక అయిన ‘Playmen’ వ్యవస్థాపకురాలు, అడెలినా టాటిలో జీవితం ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. కంటెంట్ బో*ల్డ్‌గానే ఉంటుంది. అయితే మహిళలు తమ ఫ్యాషన్ కోసం ఎలా ఫైట్ చేసి విన్ అయ్యారో ఇన్‌స్పైర్ గా చూపిస్తుంది. ఈ సిరీస్ ని ఒంటరిగానే చూడండి. ఇది ఎప్పుడు వస్తుంది ? ఏ ఓటీటీలోకి వస్తుంది ? దీని పేరు ఏమిటి ? అనే వివారాలను తెలుసుకుందాం పదండి.
‘మిస్టర్స్ ప్లేమెన్’ (Mrs Playmen) అనేది ఏడు ఎపిసోడ్‌ల ఇటాలియన్ హిస్టారికల్ వెబ్ సిరీస్. రికార్డో డోన్నా దీనికి దర్శకత్వం వహించారు. ఇది 2025 నవంబర్ 12న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. 1970లలో ఇటలీలో మొట్టమొదటి శృంగార పత్రిక అయిన ‘Playmen’ వ్యవస్థాపకురాలు అడెలినా టాటిలో జీవితం ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. ఐయండిబిలో ఈ సిరీస్ 7.1 రేటింగ్ ని పొందింది.
అడెలినా టాటిలో అనే యంగ్ అమ్మాయి 1970కాలంనాటి రోమ్‌లో ఉంటుంది. ఆమె భర్త సారో ఆమెను మోసం చేసి, భారీ అప్పులు పెట్టి, దొంగతనం చేసి జైలుకి వెళ్లిపోతాడు. ఇక అడెలినా ఒంటరిగా మిగిలిపోతుంది. ఇది వరకు వీళ్ళు నడుపుతున్న ‘ప్లేమెన్’ అనే ఎరోటిక్ మ్యాగజైన్ (ప్లేబాయ్ లాంటిది, న్యూ*డ్ ఫోటోలతో ఈ మ్యాగజైన్ ఉంటుంది) ఒక్కటే మిగులుతుంది. దీనిని నడిపే బాధ్యత ఆమె తీసుకుంటుంది. ఆ కాలంలో ఇటలీ చర్చి నియమాలు బలంగా ఉండేవి. మహిళలు ఇంట్లోనే ఉండాలని రూల్స్ పక్కాగా ఉండేవి. ఈ సమయంలో ఒక అమ్మాయి ఇలాంటి మ్యాగజైన్ నడపడం అంటే కత్తి మీద సాము లాంటిదే. ఈ విషయం తెలిసి అందరూ షాక్ అయ్యారు. అందరూ షేమ్ షేమ్ అని తిట్టారు. పోలీస్ రైడ్స్, కోర్ట్ కేసులు, చర్చి నుంచి వ్యతిరేకత , ఫెమినిస్ట్ లు కూడా మహిళల బాడీని అమ్మకానికి పెడుతోందని ప్రొటెస్ట్ చేశారు.
Read Also : హిందువుల ఊచకోతను కళ్ళకు కట్టినట్టు చూపించే మరో రియల్ స్టోరీ… ‘బెంగాల్ ఫైల్స్’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
కానీ అడెలినా ధైర్యంగా ముందుకు వెళ్తుంది. మ్యాగజైన్‌ను పూర్తిగా మార్చేస్తుంది. మ్యాగజైన్‌లో మహిళల డిజైర్, సెక్సువాలిటీ, ఫ్రీడమ్ మీద డేరింగ్ ఆర్టికల్స్ పెడుతుంది. మహిళలు తమ బాడీని ఎలా ఎంజాయ్ చేసుకోవాలి, సొసైటీ రూల్స్ బ్రేక్ చేయడం లాంటి టాపిక్స్ తో ఈ ఆర్టికల్స్ సూపర్ హిట్ అవుతాయి. సేల్స్ మునుపెన్నడూ లేని విధంగా జరుగుతాయి. మహిళలు సీక్రెట్‌గా చదవడం స్టార్ట్ చేస్తారు. ఇటలీలో సెక్సువల్ రివాల్యూషన్ (మహిళలు ఫ్రీగా మాట్లాడటం, డివోర్స్, బర్త్ కంట్రోల్ లాంటివి) స్టార్ట్ అవుతుంది. చివర్లో మ్యాగజైన్ సూపర్ సక్సెస్ అవ్వడంతో పాటు, అడెలినా ఇటాలియన్ ఫెమినిజం ఐకాన్ అవుతుంది.