Shreyas Iyer: ఇండియా స్టార్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ ( Shreyas Iyer ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడిప్పుడే టీం ఇండియాలో ఎదుగుతున్న కుర్ర క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్, ఇటీవల కాలంలో వైస్ కెప్టెన్ గా కూడా ఛాన్స్ దక్కించుకున్నాడు. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్డే సిరీస్ నేపథ్యంలో వైస్ కెప్టెన్ గా కొనసాగాడు శ్రేయాస్ అయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో అద్భుతంగా రాణించిన సందర్భంగా శ్రేయాస్ అయ్యర్ కు టీమిండియాలో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. అయితే అలాంటి శ్రేయాస్ అయ్యర్ పై బాలీవుడ్ నటి, మోడల్ షెహ్నాజ్ కౌర్ గిల్ బోల్డ్ కామెంట్స్ చేశారు. మగాడు అంటే శ్రేయాస్ అయ్యర్ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఛాన్స్ వస్తే పెళ్లి చేసుకుంటానని కూడా బాంబు పేల్చారు షెహ్నాజ్ కౌర్ గిల్ ( shehnaaz gill ). దీంతో షెహ్నాజ్ కౌర్ గిల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Also Read: IPL 2026: SRH నుంచి ట్రావిస్ హెడ్ ఔట్…రంగంలోకి రోహిత్ శర్మ..కావ్య పాప ప్లాన్ అదుర్స్ ?
టీమిండియా యంగ్ క్రికెటర్ శ్రేయాస్ అయ్యర్ కు రోజు రోజుకు ఫాలోయింగ్ పెరుగుతుంది. టీమిండియాలో క్రమక్రమంగా ఎదుగుతున్న శ్రేయాస్ అయ్యర్ ప్రదర్శన చూసి అమ్మాయిలందరూ ఫిదా అయిపోతున్నారు. అప్పట్లో విరాట్ కోహ్లీకి కూడా ఇలాంటి ఫాలోయింగ్ వచ్చింది. ఇప్పుడు అతని స్థానంలో శ్రేయాస్ అయ్యర్ దుమ్ములేపుతున్నాడు. దానికి తగ్గట్టుగానే బాలీవుడ్ హీరోయిన్లతో పాటు టాలీవుడ్ హీరోయిన్లు కూడా శ్రేయాస్ అయ్యర్ కు ఫ్లాట్ అయిపోతున్నారు.
లేటెస్ట్ గా శ్రేయాస్ అయ్యర్ కు ఇన్ డైరెక్ట్ గా ప్రపోజ్ చేసింది షెహ్నాజ్ కౌర్ గిల్ ( shehnaaz gill ). తనకు శ్రేయాస్ అయ్యర్ అంటే పిచ్చి ప్రేమ అంటూ వెల్లడించింది. అతడు అంటే తనకు ప్రాణమని తెలిపింది. పెళ్లి చేసుకుంటే శ్రేయాస్ అయ్యర్ లాంటివాన్ని చేసుకుంటానని వెల్లడించింది. ఛాన్స్ ఇస్తే, శ్రేయాస్ అయ్యర్ తో పిల్లలను కూడా కంటానని పరోక్షంగా చెప్పేసింది. దీంతో ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో వన్డే సందర్భంగా గాయం బారిన పడ్డాడు శ్రేయాస్ అయ్యర్. దీంతో తన శరీరంలో ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆస్ట్రేలియాలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందాడు శ్రేయాస్ అయ్యర్. ఒకానొక సమయంలో ఆయన పరిస్థితి విషమించింది. కానీ ప్రత్యేక వైద్యులను రంగంలోకి దింపి అతని ప్రాణాలు కాపాడింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఇక ఇటీవల కోలుకున్న ఆయన విదేశాల్లో ఎంజాయ్ చేసేందుకు వెకేషన్ కు వెళ్ళాడు. ఈ తరుణంలోనే శ్రేయాస్ అయ్యర్ గట్స్ ఉన్నవాడని షెహ్నాజ్ కౌర్ గిల్ కామెంట్స్ చేసినట్లు ఫ్యాన్స్ చెబుతున్నారు.
Also Read: Virat Kohli Restaurant: గోవాపై కన్నేసిన విరాట్ కోహ్లీ..అదిరిపోయే హోటల్ లాంచ్, ధరలు వాచిపోతాయి