Richa Ghosh: మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 టోర్నమెంట్ విజేతగా టీం ఇండియా నిలిచింది. దీంతో వరల్డ్ కప్ ఆడిన టీమిండియా ప్లేయర్లకు వరుసగా ఆఫర్లు దక్కుతున్నాయి. తమ తమ రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా టీమిండియా ప్లేయర్లకు ప్రైజ్ మనీతో పాటు డీఎస్పీ పోస్టులు కూడా ఇస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే టీమిండియా వికెట్ కీపర్ రిచా ఘోష్ కు (Richa Ghosh) అరుదైన గౌరవం దక్కింది. పశ్చిమ బెంగాల్ కు సంబంధించిన రిచా ఘోష్ పేరుతో ప్రత్యేకంగా స్టేడియాన్ని నిర్మించబోతున్నట్లు అక్కడి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee ) సంచలన ప్రకటన చేశారు. ఇప్పటికే రిచా ఘోష్ కు డీఎస్పీ పదవి ఇవ్వగా ఇప్పుడు కొత్త స్టేడియం నిర్మించి, దానికి ఆమె పేరు పెట్టనున్నారట. ఈ మేరకు మమతా బెనర్జీ సర్కార్ సంచలన ప్రకటన చేసింది.
Also Read: Virat Kohli Restaurant: గోవాపై కన్నేసిన విరాట్ కోహ్లీ..అదిరిపోయే హోటల్ లాంచ్, ధరలు వాచిపోతాయి
టీమిండియా మహిళల జట్టులో సభ్యురాలుగా ఉన్న రిచా ఘోష్ కు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బంపర్ ఆఫర్లు ప్రకటించింది. జట్టుకు కీలక సమయంలో అండగా నిలిచిన రిచా ఘోష్ కు డీఎస్పీ పదవి కూడా ఇచ్చింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. సీఎం మమతా బెనర్జీ ఆదేశాల మేరకు డీఎస్పీ ర్యాంక్ ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దాంతో పాటు బెంగాల్ రాష్ట్రానికి సంబంధించిన క్రికెట్ బోర్డు కూడా దాదాపు రూ. 34 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ డబ్బులతో పాటు తాజాగా మమతా బెనర్జీ అదిరిపోయే ప్రకటన చేసింది.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరో కొత్త స్టేడియం నిర్మించబోతున్నట్లు వెల్లడించింది. ఆ స్టేడియానికి రీచా ఘోష్ పేరు పెట్టబోతున్నట్లు సంచలన ప్రకటన చేశారు ముఖ్యమంత్రి మమత బెనర్జీ. మహిళలు ఇంట్లో వస్తువు కాదని, అన్ని రంగాల్లో రాణించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రీచా ఘోష్ లాగా పశ్చిమబెంగాల్ మహిళలు కూడా అద్భుత విజయాలు సాధించాలని కోరారు. అలా జరగాలంటే రిచా ఘోష్ కు మంచి గౌరవం దక్కాలన్న నేపథ్యంలో స్టేడియం నిర్మాణం జరిపి, నామకరణం చేస్తామని వివరించారు.
టీమిండియా తరఫున అద్భుతంగా రానించిన రిచా ఘోష్ తన 16 సంవత్సరాల వయసులోనే టీమ్ ఇండియాలోకి వచ్చింది. సచిన్ టెండూల్కర్ తరహాలో ఎదిగింది. ఇప్పుడు ధోని లాగా రెచ్చిపోతుంది. 22 సంవత్సరాలు ఉన్న రిచా ఘోష్ 18 బంతుల్లోనే టి20లో అర్థ సెంచరీ చేసుకున్న రికార్డు కూడా ఆమె సొంతం చేసుకున్నారు. అలాగే ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ కూడా సాధించారు. CWG టోర్నమెంట్ లో సిల్వర్ సాధించిన రిచా ఘోష్ , 2023 అండర్ 19 టీ20 వరల్డ్ కప్ లో ప్రాతినిధ్యం వహించారు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024 ఛాంపియన్ జట్టులో ఆమె సభ్యురాలుగా ఉన్నారు. ఇప్పుడు మహిళల వన్డే వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా జట్టులో కూడా సభ్యురాలుగా ఉన్నారు. లేటెస్ట్ గా వెస్ట్ బెంగాల్లో డీఎస్పీ పోస్ట్ దక్కించుకున్నారు రిచా ఘోష్.
Also Read: IPL 2026: SRH నుంచి ట్రావిస్ హెడ్ ఔట్…రంగంలోకి రోహిత్ శర్మ..కావ్య పాప ప్లాన్ అదుర్స్ ?
🏟️ *RICHA GHOSH STADIUM COMING SOON!* 🌟
A proud move by West Bengal CM *Mamata Banerjee* to honour Bengal’s cricket star! 🇮🇳🔥 pic.twitter.com/hI7eqZzUx5— CricketGully (@thecricketgully) November 10, 2025